Samantha

Samantha: అక్కినేని ఫ్యామిలీలోకి నాగార్జున పెద్ద కోడలుగా వెళ్ళింది స్టార్ హీరోయిన్ సమంత. పెళ్లయ్యాక చాలా రోజులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు నాగచైతన్య సమంత. అయితే వీరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తయో తెలియదు కానీ నాలుగు సంవత్సరాలకే విభేదాల కారణం గా విడాకులు అంటూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే వీరిద్దరికి అఫీషియల్ గా విడాకులు వచ్చాయా లేదో తెలియదు కానీ. ప్రస్తుతం వీరిద్దరు మాత్రం దూరంగానే ఉంటున్నారు.

ఎంతలా అంటే సమంత (Samantha) అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న కూడా కనీసం నాగచైతన్య స్పందించి త్వరగా కోలుకోవాలి అని ట్వీట్ కూడా చేయనంత దూరం అయిపోయారు. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్య ని మళ్ళీ కలుసుకోవాలని చూస్తుంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఇంతకీ నాగచైతన్య (Nagachaithanya) ని సమంత ఎందుకు మళ్ళీ కలవాలనుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా సమంత గురించి వస్తున్న వార్తల ప్రకారం.. సమంత నాగచైతన్యను వదిలేసింది కానీ అక్కినేని ఫ్యామిలీని కాదు.

అక్కినేని ఫ్యామిలీతో తనకు ఉన్న బంధాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంది అంటూ ఒక వార్త వినిపిస్తోంది. మరి అలా ఎందుకంటే ఈ మధ్యకాలంలో అఖిల్ హీరోగా చేస్తున్న ఏజెంట్ (Agent)  మూవీ కి సంబంధించి ఒక పవర్ఫుల్ టీజర్ ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఇక అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ టీజర్ కి సమంత లైక్ చేయడమే కాకుండా అఖిల్ ని ఆ టీజర్ లో అఖిల్ ని చూసిన సమంత బీస్ట్ మోడ్ అంటూ ఒక కామెంట్ కూడా చేయడం ప్రస్తుతం అందరిని షాక్ కి గురి చేసింది.

ఎందుకంటే ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి సమంత (Samantha) కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సమంత అఖిల్ కి అలా కామెంట్ పెట్టడం ప్రస్తుతం అందరిని అట్రాక్ట్ చేసింది. అయితే సమంత మయాసైటిస్ తో బాధపడుతున్నప్పుడు కూడా అఖిల్ (Akhil)  త్వరగా కోలుకోవాలని ఓ పోస్ట్ పెట్టాడు.అయితే ఈ విషయం తెలిసిన చాలామంది సమంత మళ్లీ అక్కినేని ఫ్యామిలీతో కలవాలనుకుంటుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed