Rajasekhar.Rajasekhar.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ (Rajasekhar) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా రాజశేఖర్ ఎన్ని సినిమాలు చేసినా సరే రాజశేఖర్ అంటే ఆడియన్స్ ముందు ఆయన చేసిన యాంగ్రీమెన్ పాత్రలే గుర్తుకు వస్తాయి. తెలుగు రాష్ట్రాలలో ఈయనని అందరు అలాగే పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయన కెరియర్ లో రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాతో సహా ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ వదులుకోవడం జరిగింది.

కథల ఎంపిక విషయంలో ఎప్పుడూ ఆలోచించే ఈయన కథ నచ్చితే హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించడానికి ఎలాంటి మొహమాటం చూపించడు. అన్ని కుదిరి ఉంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధ్రువ సినిమాలో అరవింద స్వామి క్యారెక్టర్ కోసం ముందుగా రాజశేఖర్ ను అనుకున్నారు. కానీ చివరకు ఆ పాత్రను అరవిందస్వామి తో తెలుగులో చేయించారని రాజశేఖర్ అప్పట్లో ఒక మీడియాతో వెల్లడించిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా హీరోగా సక్సెస్ లేని ఈయన ప్రవీణ్ సత్చార్ దర్శకత్వంలో తెరకెక్కిన గరుడవేగ సినిమాతో ట్రాక్లోకి వచ్చాడు.

ఇదిలా ఉండగా ఒక రామ్ చరణ్ సినిమాలోనే కాదు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ఆయన వదులుకున్నాడు. వాటి గురించి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా విలన్ గా రాజశేఖర్ పేరు ప్రస్తావన లోకి వచ్చింది. అంతకుముందు చిరు హీరోగా నటించిన స్నేహం కోసం సినిమాలో విజయ్ కుమార్ చేసిన పాత్ర కోసం కూడా రాజశేఖర్ ను అనుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ కు సూట్ కారని చిరంజీవి చెప్పారట. అంతేకాదు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్ర కోసం కూడా రాజశేఖర్ అనుకున్నారు కానీ ఫైనల్ గా ఉపేంద్ర నటించారు.

అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజు క్యారెక్టర్ కోసం కూడా పరిశీలించగా.. ఆయనను ఫైనల్ చేశారు. జెంటిల్మెన్ సినిమాలో కూడా అర్జున్ స్థానంలో అనుకోగా ఆ తర్వాత రాజశేఖర్ ను కాదని అర్జున్ కు అవకాశం ఇచ్చారు. భారతీయుడు సినిమాలో కూడా కమల్ హాసన్ పాత్ర కోసం ఈయనను అనుకున్నారు . ఠాగూర్ సినిమాకి ముందు రాజశేఖర్ ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడు. ఇలా ఎన్నో సినిమాలను ఆయన వదులుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed