VKNareshVKNaresh.. హాస్య చిత్రాలకు పెట్టింది పేరు జంధ్యాల. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా 80, 90 దశకాలలో ప్రేక్షకులకు ఈయన స్టార్ డైరెక్టర్. జంధ్యాల హాస్య ప్రియులను కడుపుబ్బ నవ్వించే సినిమాలు తీసి హాస్య డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇప్పుడు జబర్దస్త్ తో పాటు ఇతర టీవీ షోలో కనిపించేలాంటి కామెడీ కాకుండా ఆరోగ్యకరమైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు ఈయన పండించే హాస్యంలో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా కనిపించేవి కాదు.

ఆయన కెరియర్లో 300 చిత్రాలకు రచయితగా పనిచేయడంతో పాటు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా జంధ్యాల భార్య అన్నపూర్ణమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆయన గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది. కొత్త వారితో సినిమాలు చేయడానికి జంధ్యాల ఆసక్తి చూపించేవారు కాదు.. నాటకాలలో నటించే వారిని చూసి వారికి ఆయన ఆఫర్లు ఇచ్చేవారు. అంతేకాకుండా ఆయన నరేష్ తో ఎక్కువ సినిమాలు చేసేవారు.

నరేష్ చెన్నైలో పుట్టి అక్కడే పెరగడం వల్ల ఆయనకు తెలుగు మాట్లాడటం చదవడం వచ్చేది కాదు.. దాంతో జంధ్యాల గారు తెలుగు అక్షరాలు నేర్పించి వాటిని ఎలా పలకాలో కూడా నేర్పించారు.అంతేకాదు నరేష్ తెలుగు సరిగ్గా పలకకపోవడంతో జంధ్యాల ఎస్పీ బాలు తో డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నారు. కానీ విజయనిర్మల మాత్రం నరేష్ తోనే డబ్బింగ్ చెప్పించాలని అన్నారు. దాంతో జంధ్యాల మొదటి సినిమాకు నరేష్ డబ్బింగ్ చెబితే ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము కానీ బాలు గారితో డబ్బింగ్ చూపిస్తే నరేష్ భవిష్యత్తు బాగుంటుందని సలహా ఇచ్చారు.

దాంతో విజయనిర్మల కూడా ఒప్పుకున్నారట అలా నరేష్ ఇప్పుడు తన తర్వాత సినిమాలకు తెలుగు నేర్చుకొని తానే సొంతంగా డబ్బింగ్ చెప్పడంతో పాటు టాలీవుడ్ లో నటుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంటూ జంధ్యాల భార్య అన్నపూర్ణమ్మ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *