Bhanupriya

Bhanupriya: 80వ దశకం నాటి హీరోయిన్లు చాలామంది ప్రస్తుతం అమ్మ,అత్త, అమ్మమ్మ, నానమ్మ వంటి పాత్రల్లో చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక అలాంటి వారిలో నటి భానుప్రియ కూడా ఒకరు. ఈమె అప్పట్లో స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా వెలిగింది. ఇక ఈమె నాట్యం చూస్తే అందరూ అదరహో అనాల్సిందే. నెమలి ని మించిన నాట్యం అంటూ ఈమె చేసే నాట్యానికి చాలామంది పేర్లు పెట్టేవారు. అమాయకంగా చూసే ఈమె కళ్ళు చూస్తే చాలామంది ఫిదా అవ్వాల్సిందే. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా కన్నడ, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.

అయితే అంత పెద్ద స్టార్ హీరోయిన్ పెళ్లి అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోయిన్గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. కానీ ఈ మధ్యకాలంలో భానుప్రియ (Bhanupriya) ఎక్కువగా కనిపించడం లేదు. దానికి ప్రధాన కారణం ఆమెకు ఉన్న ఆ జబ్బేనట. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ.. ఆదర్శ కౌశల్ (Adarsh Koushal) నేను ఇద్దరం మా అమ్మని ఎదిరించి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పెళ్లయ్యాక చాలా రోజులు హ్యాపీగా ఉన్నాను.కానీ నా భర్త చనిపోయాక నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లాను.దాంతో నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది.

ఈ మధ్య కాలంలో నాకు మెమొరీ పవర్ కూడా తగ్గిపోయింది. ఏదైనా పని చేస్తే అది గుర్తుండడం లేదు. రోజురోజుకి ఈ జబ్బు నాకు ఎక్కువవుతుంది. అయితే ఇటీవల నేను సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న టైంలో డైలాగ్ మర్చిపోయి చాలా ఇబ్బంది పడ్డాను.ఆ తర్వాత మళ్లీ నేర్చుకొని డైలాగ్ చెప్పాను. అయితే నా ఆరోగ్యం సహకరించలేకపోవడం వల్లే నాకు ఇలా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అయితే నా భర్తతో నాకు విడాకులు అయ్యాయని, అందుకే మేమిద్దరం దూరమయ్యామని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. కానీ అది పూర్తిగా అవాస్తవం.మా మధ్య ఎలాంటి దూరం పెరగలేదు. మేము విడాకులు తీసుకోలేదు.

మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది. అయితే నేను సినిమాల్లో నటించడం వల్ల ట్రావెలింగ్ ఇబ్బంది ఉంటుందని నేను చెన్నైలో ఉండే దానిని. మా ఆయన హైదరాబాదులో ఉండేవారు.అయితే మనుషులం మాత్రమే దూరంగా ఉన్నాము కానీ మా మనసులు ఎప్పటికీ కలిసే ఉన్నాయి అంటూ ఆ ఇంటర్వ్యూలో తనకున్న వ్యాధి గురించి అలాగే తన భర్తతో విడాకులపై స్పందించింది నటి భానుప్రియ(Bhanupriya). ప్రస్తుతం భానుప్రియ మాట్లాడిన మాటలు విన్న చాలా మంది ఈమె అభిమానులు ఆమెకు ఉన్న జబ్బు గురించి తెలిసి చాలా బాధపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *