Meens

Meena: బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మీనా అంటే ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. అలాంటి మీనా కేవలం బాలనాటి గానే కాకుండా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. ఇక అప్పట్లో హీరోయిన్ మీనా రేంజ్ ఎలా ఉండేది అంటే చాలామంది స్టార్ హీరోలు సైతం ఈమె డేట్స్ ఖాళీగా లేకపోతే వారి సినిమానే వాయిదా వేసుకునేవారు.

అంత బిజీ బిజీగా ఉండేది హీరోయిన్ మీనా.అలాంటి హీరోయిన్ మీనా (Meena) తన కెరియర్ పీక్స్ లో ఉండగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది అయితే విద్యాసాగర్ మీనాని మళ్లీ సినిమాలో నటించమని ప్రోత్సహించడంతో మీనా మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తోంది. ఎంతో సంతోషంగా సాగుతున్న మీనా జీవితంలో ఒక అనుకొని పెను తుఫాను వచ్చి మీనా జీవితంలో విషాదాన్ని నింపింది.

మీనా భర్త విద్యాసాగర్ రావు (Vidya sagar Rao) అనారోగ్య కారణాలతో మరణించడంతో చిన్న వయసులోనే మీనా తన భర్తని కోల్పోవాల్సి వచ్చింది.తన భర్త చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మీనా తన భర్త జ్ఞాపకాలనుండి బయటపడలేక పోతుంది.ఇప్పుడిప్పుడే మీనా ఆ బాధ నుండి కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది. అయితే మీనా కి కూతురు ఉన్నందువల్ల చాలామంది ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె మాత్రం రెండో పెళ్లి చేసుకోవట్లేదు.

అయితే ఇండస్ట్రీలో ఉన్న ఓ స్టార్ హీరో మీనా (Meena) ని రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారట. అంతేకాదు ఆ హీరోకి ఇప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్నారు.కానీ ఈ మధ్యనే భార్యకి విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు. మీనా ని రెండో పెళ్లి చేసుకోవాలని ఆ హీరో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ విషయంలో మీనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *