Anchor Ravi

Anchor Ravi: చాలామంది ఇప్పటికే బుల్లితెరపై యాంకర్లుగా చేసినవారు వెండితెరపై కూడా స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా.. హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పటికే సుధీర్, ప్రదీప్ వంటి యాంకర్లు కేవలం బుల్లితెర మీదే కాకుండా వెండితెర మీద కూడా తామ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఇక ఇలాంటి కోవలోకే వస్తారు యాంకర్ రవి. ఈయన కూడా ఇది మా ప్రేమ కథ అనే సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

యాంకర్ రవి (Anchor Ravi) ఎన్నో షోలకు యాంకర్ గా చేస్తూనే అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా హోస్ట్ గా వ్యవహరించారు. అంతేకాదు బుల్లితెరపై జరిగే ఎన్నో ఈవెంట్లకు ఈయన పాల్గొని నానా హడావిడి చేస్తారు. అలాగే బుల్లితెర పై అతిపెద్ద రియాల్టీ షో అయినా బిగ్ బాస్ లోకి కూడా కంటెస్టెంట్ గా వెళ్లి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి యాంకర్ రవి ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు.

దానికి యాంకర్ రవి చేసిన ఆ తప్పు పనే అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకీ యాంకర్ రవి చేసిన ఆ తప్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాంకర్ రవి (Anchor Ravi) చేతిలో అప్పట్లో ఎన్నో ఈవెంట్లు షోలు ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన కాస్త డల్ అయిపోయారు. ఈయనను యాంకర్ గా తీసుకోవడానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు.

దానికి ప్రధాన కారణం ఈయన ఏదైనా ఈవెంట్లో గాని షోలో గాని యాంకరింగ్ చేస్తే ఎదుటివారిని చులకన చేసి చూడడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వేయడం వల్ల చాలామందిలో యాంకర్ రవికి ఉన్న క్రేజ్ తగ్గిపోయింది.దాంతో యాంకర్ రవికి ఎవరూ కూడా అవకాశాలు ఇవ్వడం లేదు.ప్రస్తుతం బుల్లితెరపై మేల్ యాంకర్స్ లో ప్రదీప్ (Pradeep) టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు.

0 thoughts on “Anchor Ravi: అలాంటి తప్పు చేసి యాంకరింగ్ కు దూరమవుతున్న యాంకర్ రవి..!!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *