VanijayaramVanijayaram సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన నిన్నటి రోజున నటుడు డైరెక్టర్ కె.విశ్వనాథ్ హఠాత్మరణం నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం(Vanijayaram) మరణించినట్లుగా తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఈమె కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. చెన్నైలోని తన నివాసంలో ఈమె తుది శ్వాస విడిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె మరణించే సమయానికి ఈమె వయసు 78 సంవత్సరాలు.

ఇటీవల ప్రభుత్వం కూడా ఈమెకు గాయానికి పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది. ఇలాంటి సమయంలోనే ఈమె కన్ను మూయడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురి అవుతోంది. ఇక ఇదే సమయంలో ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులతో పాటు , అభిమానులు కూడా ఈమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వాణీ జయరామ్ తమిళనాడులోని వేలూరులో పుట్టింది .

వాణీ జయరామ్ తెలుగు, తమిళ్ భాషలలో సహా 20 వేలకు పైగా పాటలు పాడింది. 1000 కి పైగా చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ సింగర్ గా వ్యవహరించింది. ముఖ్యంగా భక్తి గీతాలకి పెట్టింది పేరు వాణీ జయరామ్ . ఇలా సుమారుగా 19 భాషలకి పైగా ఈమె తన పేరును పాపులారిటీ చేసుకుంది. ఈ గానకోకిలకు ఇటీవల పద్మభూషణ్ పురస్కారం కూడా వరించింది. అయితే ఈ అవార్డు అందుకోకుండానే ఈమె ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది.

వాణీ జయరామ్ తమిళనాడులో వేలూరులో 1945 నవంబర్ 30న జన్మించింది. ఇక ఈమెకి ఎనిమిదవ సంవత్సరంలోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశం లభించింది. దీంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈమె సినీ ఎంట్రీ మాత్రం చాలా విచిత్రంగా జరిగిందని తెలుస్తోంది. వివాహమైన తర్వాత ముంబైలో స్థిరపడిన ఈమె అనుకోని విధంగా బాలీవుడ్లో గుడ్డి అనే సినిమా ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది.. అలా ఎన్నో చిత్రాలకు తన గానాన్ని అందించి పలు విజయాలను సొంతం చేసుకుంది వాణి జయరామ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *