TarakaratnaTarakaratna… నందమూరి వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని.. సినిమాలలో స్టార్ హీరో పొజిషన్ కి చేరుకోవాలని ఎన్నో కలలు కన్నారు నందమూరి తారకరత్న (Tarakaratna).. కానీ అనుకున్నంత స్థాయిలో సినిమాలలో సక్సెస్ కాకపోయేసరికి ఇప్పుడు రాజకీయ రంగం వైపు అడుగులు వేయాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ (Naralokesh) కుప్పం నుంచి యువగళం పేరిట పాదయాత్ర మొదలుపెట్టారు. అందులో పాల్గొన్న నందమూరి తారకరత్న కొద్దిదూరం నడిచిన వెంటనే స్పృహ తప్పి పడిపోయారు.

హుటా హుటిన సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించి ప్రథమ చికిత్స నిమిత్తం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత అత్యవసర చికిత్స అందించి.. మెరుగైన వైద్యం అందించడం కోసం పదిమంది ప్రత్యేక వైద్య బృందంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించి ఆయన ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించారు.అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని నారాయణ హృదయాలయ వారు తారకరత్నకు అందిస్తున్నట్లు నందమూరి, నారా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తారకరత్నకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు కదా.. మరి ఆ చికిత్స ఖర్చు వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు అని.. అందుకే పూర్తి ఖర్చును తామే భరిస్తాము అన్నట్లుగా చంద్రబాబు నాయుడు(Chandrababunaidu), నారా లోకేష్ ముందుకు వచ్చారని ఇప్పుడు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా వైద్య చికిత్సకు ఖర్చు అయినట్లు..ఆ ఖర్చు వీరే భరించినట్లు తెలుస్తోంది.

నందమూరి కుటుంబ సభ్యులతో పోల్చుకుంటే తారకరత్న ఆర్థికంగా కాస్త వెనుకబడి ఉన్నారు. కాబట్టే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. ఇదిలా వుండగా హాస్పిటల్ నుంచీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తారకరత్న(Tarakaratna) ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *