Naga Chaithanya

Naga Chaithanya: గత ఏడాది నుండి అక్కినేని ఫ్యామిలీ ఏ పని చేసినా కలిసి రావడం లేదు. అంతేకాదు ప్రతి విషయంలో అక్కినేని ఫ్యామిలీని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య నటించిన సినిమాలు వరసగా డిజాస్టర్ అయ్యాయి. ఇదిలా ఉంటే నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా కూడా అక్కినేని అభిమానులను ఏమాత్రం సంతృప్తి పరచలేకపోయింది.

దీంతో అక్కినేని ఫ్యామిలీ పై అక్కినేని అభిమానులు కూడా చాలా నిరాశగా ఉన్నారు.అక్కినేని ఫ్యామిలీకి కేవలం సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఏ మాత్రం కలిసి రావడం లేదు.ఇప్పటికే నాగార్జున కొడుకులైన నాగచైతన్య (Naga Chaithanya) పెళ్లి చేసుకొని కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నారు. అలాగే అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకొని ఏమైందో ఏమో కానీ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంలో అక్కినేని అభిమానులు చాలా ఖుషిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని అమల (Amala) నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా అది కూడా జరగాల్సిందే అంటూ ఒక కండిషన్ పెట్టిందట.ఇంతకీ ఆమె పెట్టిన కండిషన్ ఏంటంటే..నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా అఖిల్ కూడా పెళ్లి చేసుకోవాలట.

కానీ అఖిల్ కి మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.ఈ విషయంలో అమల మాత్రం అఖిల్ పెళ్లి జరిగితేనే నాగచైతన్య కూడా రెండో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి కూర్చుందట.ఈ తరుణంలోనే అక్కినేని ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయట.అంతేకాదు నాగచైతన్య (Naga Chaithanya) అమలపై కోపంగా ఉన్నట్లు కూడా సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *