K.Vishwanath

K.Vishwanath: తెలుగు చలనచిత్ర సీమ రంగంలో అపురూప కళాఖండ కావ్యాలను మనకు అందించి అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన నుండి ఈయన గురించి ప్రతిసారి ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంది. అంతే కాదు ఆయన మరణించాక ఆయన గురించి ఒక్కొక్క విషయం బయట పడుతుంటే చాలామంది కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఈయన మరణ వార్త విని చాలామంది సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఆత్మగౌరం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా కె విశ్వనాథ్ (K.Vishwanath) గారు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఈయన డైరెక్షన్లో ఎన్నో ఆణిముత్యాల లాంటి సినిమాలు తెరకెక్కాయి. స్వర్ణకమలం,సాగర సంగమం, స్వాతిముత్యం, శంకరాభరణం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు ఈయన దర్శకత్వం చేశారు. ఇక అలాంటి కళాతపస్వి కే విశ్వనాథ్ గారికి ఒక తీరని కోరిక ఉందట. అంతేకాదు ప్రస్తుతం ఆయన మరణించాడు కాబట్టి ఆయన చివరి కోరిక తీరకుండానే మరణించారా అంటూ చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇంతకీ ఆయన చివరి కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కళాతపస్వి కే విశ్వనాథ్ గారు ఆయన డైరెక్షన్ లో ఎన్నో సాంఘికచిత్రాలకు దర్శకత్వం వహించారు.కానీ ఈయన ఏనాడు కూడా పౌరాణికం సినిమా తెరకెక్కించే దిశగా అడుగులు వేయలేదు. కానీ ఈయనకు ఒక బలమైన కోరిక ఉండేదట. అదేంటంటే అన్నమయ్య సినిమాని తెరకెక్కించాలని. అన్నమయ్య (Annamayya) సినిమాని దర్శకత్వం చేయాలని చాలా రోజులు కలలు కన్నారట.

అంతేకాదు ఆ సినిమా తెరకెక్కించాలి అనే ఉద్దేశంతో అన్నమయ్య సినిమా స్టోరీ పై ఎన్నో పరిశోధనలు చేసి దాన్ని అక్కడే పెట్టేశారు. కానీ అదే టైంలో రాఘవేంద్రరావు అన్నమయ్య సినిమా అని తెరకెక్కించారు. దాంతో విశ్వనాథ్ (K.Vishwanath)  గారు తెరకెక్కించాలి అనుకున్న అన్నమయ్య సినిమా అక్కడితో ఆగిపోయింది. ఇక ఆయన బ్రతికున్నన్ని రోజులు ఈ సినిమా తీయలేదని చాలా బాధపడ్డారట. అంతేకాదు ఈయన చివరి కోరిక కూడా ఇదేనట. ప్రస్తుతం ఈ విషయం తెలిసి చాలామంది ఈయన అభిమానులు బాధపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *