Siddharth-Kiara

Siddharth-Kiara : ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు పెళ్లిలు చేసుకొని సినిమాలతో పాటు తమ వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్ లైన చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ మధ్యనే శర్వానంద్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.అంతే కాదు ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలామంది నటీనటులు పెళ్లి బాట పడుతున్నారు.

అలియాభట్, కత్రినా కైఫ్ వంటి హీరోయిన్లు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇక తాజాగా మరో బాలీవుడ్ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. ఇక ఆ బ్యూటిఫుల్ జంట ఎవరో కాదు సిద్ధార్థ మల్హోత్రా కియారా అద్వానీ (Siddharth-Kiara). వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం వల్ల చాలా రోజుల నుండి వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై స్పందించలేదు. అయితే వీరిద్దరూ ఫిబ్రవరి 5న చాలా గ్రాండ్ గా జైసెల్మర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఇప్పటికే కియారా అద్వానీ పెళ్లికి జైసెల్మీర్ కూడా చేరుకుంది అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వీరి పెళ్లి జరిగితే వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో కొంతమంది పండితులు చెబుతున్నారు.ఇంతకీ ఆ పండితులు ఏం చెబుతున్నారంటే.. సిద్ధార్థ మల్హోత్రా కియారా అద్వానీ (Siddharth-Kiara ) పెళ్లి జరిగితే వారి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉందని, వీరిద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లికి నిశ్చయించుకున్న తేదీ కూడా చాలా బాగుందని, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకొని ఆదర్శ దంపతులుగా నిలుస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అంతే కాదు వీరికి పెళ్లి తర్వాత ఎదురయ్యే చాలా అడ్డంకులను వీరు అధిగమిస్తారని, అలా అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరి ఉండి,పూర్తిగా ప్రేమ ఆప్యాయతలతో అన్యోన్యంగా ఉంటారు అంటూ జ్యోతిష్య శాస్త్ర పండితులు వెల్లడించారు. అంతేకాదు పెళ్లయ్యాక వీరి సినీ కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉందని, పెళ్లికి ముందు ఉన్న సినీ కెరియర్ కంటే పెళ్లయ్యాక వీరి కెరియర్ మరింత ఊపు అందుకుంటుంది అని,వీరిద్దరూ ఇండస్ట్రీలో మరింతగా గుర్తింపు సంపాదించుకుంటారు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే జ్యోతిష్యశాస్త్ర పండితులు సిద్ధార్థ మల్హోత్రా కియారా అద్వానీ (Siddharth-Kiara ) ల పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలిసాక వీరి అభిమానులు ఆనందానికి అవధులు లేవు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *