తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్ 5 నో ఎగ్జిట్. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే విడుదల కాగా ఈ చిత్రం ఎలా ఉందొ ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

కొడుకంటే అమితమైన ప్రేమ కలిగిన ప్రజాసేవ పార్టీ ముఖ్యమంత్రి (సాయి కుమార్) తన తనయడు సుబ్బు(తారకరత్న) పుట్టినరోజు ను ట్రైన్ జరుపుకోవాలని ప్లాన్ చేస్తాడు. తండ్రి చెప్పినట్లుగా సుబ్బు ట్రైన్ లో ప్రయాణిస్తాడు. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో వెళ్ళే ట్రైన్ లో S5 ట్రైన్ లో వారు ఉంటారు. అదే సమయంలో సన్నీ (ప్రిన్స్) అదే ట్రైన్ ఎక్కుతాడు. అయితే వెళుతున్న ట్రైన్ లో సుబ్బు అండ్ సన్నీ బ్యాచ్ కి గొడవలవుతుంటాయి. అయితే ఆ ట్రైన్ లో ఒక్కొక్కరు మాయం అవుతూ ఉంటారు, ఎదో తెలియని భూతం వారిని మాయం చేస్తుంటుంది. అయితే అక్కడినుంచి సుబ్బు మరియు అతని స్నేహితుడు సంజయ్ బయటపడతాడు. మరి ఆ ఆ భూతం ఎవరు.. ఎందుకు ఆ కోచ్ లో ఉన్న వారిని మాయం చేస్తుంది అనే ఈ సినిమా కథ.

దాదాపుగా సినిమాలకు దూరమైపోయాడు అనుకున్న తారకరత్న ఇటీవలే కాలంలో మళ్ళీ మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అన్ని రకాల పాత్రలు చేసే నటుడిగా ఉన్న తారకరత్న ఈ సినిమాలోని సుబ్బు పాత్ర లో సరిగ్గా ఒదిగిపోయాడు. చాలా రోజుల తర్వాత ఓ డిఫరెంట్ రోల్ పోషించి మెప్పించాడు. స్టైలిష్ లుక్ లో కనిపించి ఆయనలోనే మరింత వైవిధ్య భరితమైన నటన చూసే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి గా సాయి కుమార్ ఆకట్టుకున్నాడు. తన నటనతో మరోసారి అలరించాడు. సునీల్, అలీ తమ కామెడీ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రిన్స్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.

దర్శకుడు తన తొలి సినిమాకి ఓ వైవిధ్యమైన కథను ఎంచుకుని స్క్రీన్ పై మంచి సినిమాను చూపించారు. హీరో అవుదామని వచ్చి… చివరకు కొరియోగ్రాఫర్ గా మారి.. ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తిన దర్శకుడు భరత్ కోమలపాటి అన్ని విభాగాలను బాగానే హేండిల్ చేశాడు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా కు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా… కంటెంట్ ను నమ్ముకుని సినిమా తీశారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. హారర్ థ్రిల్లర్ కి… కాస్త పొలిటికల్ డ్రామను కూడా జోడించడం ఆసక్తి కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ట్రైన్ లో ఒక కోచ్ మొత్తం మంటలు అంటుకోవడం… అందులో ఉన్న వాళ్లంతా చనిపోయారనుకుంటే… తిరిగి బతికి రావడం… వంటి అంశాలను దర్శకుడు చాలా బాగా డిజైన్ చేశారు.

కాస్త వైవిద్యంగా వున్న కథను రాసుకుని దాన్ని వినోదాత్మకంగా తెరపై ఆవిష్కరించారు. హారర్ థ్రిల్లర్ కి పొలిటికల్ డ్రామాను జోడించి… చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులు అబ్బురపడేలా సినిమా చేశారు. ప్రతి ఒక్కరు తప్పకుండ చూడాల్సిన సినిమా.

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed