Dhamaka ReviewDhamaka Review :

నటీనటులు : రవితేజ, శ్రీలీల, జయరాం, రావు రమేష్, సచిన్ ఖేద్కర్, తనికెళ్ళ భరణి,హైపర్ ఆది తదితరులు
మ్యూజిక్ : భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత : టి.జి విశ్వప్రసాద్
రచయిత : ప్రసన్న కుమార్ బెజవాడ
దర్శకుడు : త్రినాథ్ రావు నక్కిన
రిలీజ్ డేట్ : 23-12-2022

మాస్ రాజా రవితేజ నటించిన తాజా సినిమా ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే విడుదల అయ్యింది. మాస్ ఆడియెన్స్ ను ఎంతో ఆసక్తి పరిచిన ఈ సినిమా పాటలతో, ట్రైలర్ లతో ఆకట్టుకోగా సినిమా పై అంచనాలను వేరే స్థాయి లో పెంచింది. మరి ఈ సినిమా ను ప్రేక్షకులు ఏ స్థాయి లో ఆదరిస్తున్నాయో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ

ఉద్యోగం పోవడంతో చెల్లి పెళ్లి చేయడం కోసం జాబ్ వెతుక్కునే పనిలో ఉంటాడు స్వామి (Raviteja). వైజాగ్ లో వెయ్యి మందికి ఉద్యోగమిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు వివేక్ ఆనంద్ (రవితేజ). అదే సమయంలో కార్పొరేట్ కంపెనీ లను ఆక్రమించే జేపీ (Jayaram) కన్ను వివేక్ ఆనంద్ కంపెనీ పై పడుతుంది. ఆనంద్ తండ్రిని (Sachin Khedkar) బెదిరించి ఆ కంపెనీ నీ లాక్కోవాలని చూస్తాడు. అలా ఆ కంపెనీ ని జేపీ భారీ నుండి ఆనంద్ ఎలా కాపాడుకున్నాడు అనేదే అసలు కథ. స్వామి కి , ఆనంద్ కి మధ్య ఉన్న బంధం విచిత్రం ఉంటుంది. అదేంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

రవితేజ ఎప్పటిలాగే మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే ఎనర్జీ తో నటించాడు. అయన నటన గురించి, డాన్స్ ల గురించి , ఎక్స్ ప్రెషన్స్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.శ్రీ లీల (Sreeleela) హీరోయిన్ గా నటించగా తొలి సినిమా కంటే మంచి పరిణితితో ఎనర్జీ తో ఈ సినిమా లో నటించిందని చెప్పొచ్చు. డాన్స్ లలో కూడా అనుభవం ఉన్న హీరోయిన్ లాగే చేసింది. ఆమె పాత్ర కు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా ఉన్నంత మేరకు మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇక మలయాళ నటుడు జయరాం విలన్ గా మెప్పించ్చడు. విలన్ షేడ్స్ కనిపించేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రావు రమేష్, హైపర్ ఆది ల కామెడీ ప్రేక్షకులను నవ్వించింది. సచిన్ ఖేద్ఖర్ సెట్టిల్డ్ గా చాలా బాగా నటించాడు. మిగితా పాత్ర దారులు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఎంచుకున్న నేపథ్యం బాగుంది. దర్శకత్వం కూడా చాలా బాగా చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో పెద్ద దర్శకులను తలపించాడు. కొత్తరకమైన టేకింగ్ తో అలరించాడు. అయితే కథనం విషయం లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. పలు సినిమాలతో ఆకట్టుకున్న ప్రసన్న బెజవాడ రచయితగా సక్సెస్ అయ్యాడు. మంచి డైలాగులు రాశాడు. రావు రమేష్, హైపర్ ఆది(Hyper Adi) ల మధ్య సీన్స్ నుంచి కామెడీ ను చక్కగా రాబట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ అందించిన కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ చేసిన ప్రదీప్ పూడి తమ పని తాము సక్రమంగా నిర్వర్తించారు. మ్యూజిక్ సినిమా కు ప్రధాన బలం. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి

ప్లస్ పాయింట్స్ :

రవితేజ

సంగీతం

మాస్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టొరీ

వీక్ క్లైమాక్స్ , ఇంటర్వెల్

తీర్పు : రవితేజ అభిమానులు రవితేజ ఎలాగైతే చూడాలకున్నారో అలాంటి సినిమా. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ సినిమా. మాస్ సినిమా లు చూసేవారికి బాగా నచ్చుతుంది. శ్రీలీల ఎంతో గ్లామరస్ గా కనిపించడం యూత్ కి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఒకసారి చూడదగ్గ సినిమా ఇది.

Rating : 2.5/5

Click here to follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed