RGVRGV.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ramgopalvarma) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు అనవసరమైన విషయాల్లో కూడా తల దురుస్తూ కాంట్రవర్సీలకు తెర లేపుతూ ఉంటాడు. మొదట తెలుగులోనే తన కెరీర్ ను ప్రారంభించిన రాంగోపాల్ వర్మ.. తర్వాత బాలీవుడ్లో స్థిరపడిపోయారు. ఒకప్పుడు ఇండస్ట్రీకి శివ, క్షణ క్షణం, రంగీలా, భూత్ , కంపెనీ, సత్య లాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు ఇండస్ట్రీకి తీసుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ అప్పట్లో తీసిన సినిమాల లాగా ఇప్పుడు ఉండడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇదిలో ఉండగా తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్షణక్షణం సినిమా గురించి ఎన్నో విషయాలు చెబుతూనే.. మరోపక్క నటి హేమ (Hema) తో తనకున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు.. క్షణక్షణం సినిమాల్లో శ్రీదేవి హీరోయిన్ కాగా.. సెకండ్ హీరోయిన్ హేమ అని చెప్పి సినిమాకు ఒప్పించింది.. నేను కాదు అప్పుడు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శివ నాగేశ్వరరావు అలా చెప్పి పిలుచుకు వచ్చాడు. అయితే అందులో ఒకటి నిజం కూడా ఉంది. ఈ సినిమాలో శ్రీదేవితో పాటు నువ్వు ఉంటావు అని హేమాకు చెప్పాడట. అదైతే నిజం అంటూ చెప్పాడు వర్మ.

ఇక మరో ఘటన గురించి కూడా మాట్లాడుతూ శ్రీదేవి పనిచేసే ఆఫీస్ లో ఆమెపై ఆఫీసర్ గా పని చేసే వ్యక్తి పాత్ర కోసం ఒక ఆర్టిస్టు తీసుకోగా.. ఆయన సత్యా అని హీరోయిన్ ను సీరియస్ గా పిలవాలి. షూటింగ్ అయ్యాక కూడా నచ్చక మరొకసారి బ్యాంకులో రీ షూట్ చేశాం. ఇది తెలియని మొదటి సీన్ చేసిన ఆర్టిస్టు సినిమా విడుదలయ్యాక వాళ్ళ బంధువులను ఒక 50 మందిని సినిమాకి తీసుకెళ్లి చూడగా.. అందులో అతను లేకపోయేసరికి ప్రొడక్షన్ ఆఫీస్ కి కాల్ చేసి కోపంగా మాట్లాడాడు.(RGV)

అలా బంధువుల దగ్గర తనను బాగా తిట్టారు అని వర్మ ఈ సినిమా విషయాలను పంచుకున్నారు. ఇకపోతే రాంగోపాల్ వర్మ హేమ తో వున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *