Prabhas

Prabhas desire: నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) హొస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇప్ప‌టికే ఎంద‌రు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంద‌డి చేశాడు. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సైతం త‌న బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ తో క‌లిసి పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందా అని అభిమానులు ఎంత‌గానో ఎదురు చూశారు. అయితే వారి ఎదురు చూపుల‌కు ఆహా వారు తెర దించేశాడు.

ప్ర‌భాస్(Prabhas) ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చేసిన ఆహా టీమ్.. ఫ‌స్ట్ పార్ట్ ఎపిసోడ్ ను గురువారం రాత్రి 9 గంట‌ల‌కు స్ట్రీమింగ్ చేసింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని మొద‌ట‌ చెప్పినా.. డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ముందుగానే న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది ఆహా. ఈ ఎపిసోడ్ ఎంతో స‌ర‌ద‌గా సాగింది. ప్ర‌భాస్ ద‌గ్గ‌ర నుంచి బాలయ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను రాబ‌ట్టారు.

పెళ్లి, కృతి స‌న‌న్(Kriti Sanon) తో ప్రేమ త‌దిత‌రల విష‌యాల గురించి ప్ర‌భాస్‌తో చ‌ర్చించారు. ఈ టాక్ షోతో ప్ర‌భాస్ త‌న లైఫ్ లాంగ్ కోరిక‌ను సైతం బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌భాస్ మాట్లాడు.. `ఎప్పటికైనా ప్రపంచంలోని అడవులన్ని చుట్టేయాలి. లోకల్ అడవులు, కర్ణాటక, ఇండియాలోని కొన్ని అడవులు ఫ్రెండ్స్ తో తిరిగాను. ప్రపంచంలోని వేరే దేశాల్లో ఉన్న అడవులు కూడా తిరగాలని ఉంది.

అలాగే చెట్లు, మొక్కలు, జంతువులు అంటే నాకు ఇష్టం. హైదరాబాద్ బయట ఒక అడవిని దత్తత తీసుకున్నాను. నా అడవిలో పులులు, సింహాలు పెంచుకోవాలని అనుకున్నాను. గవర్నమెంట్ ని కూడా అడిగాను కానీ ఒప్పుకోలేదు. అది నెర‌వేర‌డం అంత సుల‌భం కాదు అని తెలుసు. కానీ, ఎప్ప‌టికైనా సింహాలు, పులుల‌ను పెంచుకోవాలని అనుకుంటున్నాను` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్ర‌భాస్(prabhas desire) కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *