Kalyanam Kamaneeyam Review

Kalyanam Kamaneeyam Review:

నటీనటులు : సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్, కేదార్ శంకర్, దేవి ప్రసాద్, సప్తగిరి, సద్దాం తదితరులు
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్ : శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత : యువీ కాన్సెప్ట్స్
దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్ల
విడుదల తేదీ : 14 జనవరి 2023

గోల్కొండ హై స్కూల్ సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుని హీరో గా నిలదొకక్కుకున్నాడు. ఏక్ మినీ కథ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో నటించిన తాజా చిత్రం కళ్యాణం కమనీయం. యువీ కాన్సెప్ట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజే విడుదల కాగా ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ

ఉద్యోగం లేని శివ (సంతోష్ శోబన్) సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే శ్రుతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ చివరికి పెళ్లి వరకు వెళుతుంది. శివ నిరుద్యోగి కావడం తో శృతి అతనికి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉంటుంది అయితే అంత సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో, శ్రుతి శివను ఉద్యోగం చేయమని కోరినప్పుడు కథ మలుపు తిరుగుతుంది. ఉద్యోగం కోసం తను చేస్తున్న ప్రయత్నాలను శృతి గుర్తించకపోవడమే వారి బంధంలో సమస్యలకి కారణం అవుతుంది. మరి శివ ఏ విధంగా తన వివాహ బంధాన్ని నిలుపుకున్నాడు అనేదే ఈ సినిమా కథ(Kalyanam Kamaneeyam Review)

నటీనటులు

నటుడుగా సంతోష్ శోభన్ ఈ సినిమా తో మరో మెట్టు ఎక్కాడు. అన్ని రకాల ఎమోషన్స్ ను ఎంతో బాగా పలికించాడు. గతంలో నటించిన సినిమాల కంటే ఈ సినిమా లో ఎంతో మంచి పరిణితి కనపరిచాడు. ఇక హీరోయిన్ గా నటించిన ప్రియా భవాని శంకర్ తన గ్లామర్ తో, నటనతో ఆకట్టుకుంది. కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాకుండా ఈ సినిమా లోఆమెకు మంచి ప్రాధాన్యత ఉండడం ఆమెకు మంచి పేరును తెచ్చి పెడుతుంది. ఆమె అందమే ఆమెకు ప్లస్ అయ్యింది. ఇక సద్దాం, సప్తగిరి అక్కడక్కడా కొన్ని నవ్వులు పూయించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రను బాగానే చేశారు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల ఒక మంచి కాన్సెప్ట్ ను రాసుకుని ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో తీర్చిదిద్దాడు. పెళ్లి కాన్సెప్ట్ పై ఎన్నో సినిమాలు వచ్చినా ఓ కొత్త పాయింట్ ను ఈ సినిమా ద్వారా చూపించాడు. కథనం విషయంలోనూ ఎలాంటి పొరపాట్లు చేయలేదు. సాఫీగా కథనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. తొలిసారి అయినా దర్శకత్వం లో మంచి వైవిధ్యాన్ని చూపించాడు. ఇక శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం బాగుంది. పాటలకు మంచి గుర్తింపు రావడం సినిమా పై మరిన్ని అంచనాలను పెంచింది. కార్తీక్ ఘట్టమనేని తన కెమెరాతో ఎప్పుడూ నిరాశపరచలేదు, ఈ సినిమాలో రెగ్యులర్ షాట్లు ఉన్నప్పటికీ, అతను ఈ ఫ్రేమ్‌లను అందంగా చూపించగలిగాడు. కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది. UV కాన్సెప్ట్‌ల ద్వారా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

హీరో హీరోయిన్

సినిమాటోగ్రఫీ

కథనం

మైనస్ పాయింట్స్ :

ఊహించే సన్నివేశాలు

సినిమా రేటింగ్: 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed