Pawan KalyanPawan Kalyan.. టాలీవుడ్ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ (PawanKalyan) తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తన కెరీర్ ను మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ తాను స్థాపించిన జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికలలో సత్తా చాటడానికి కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ (Pawankalyan) ఏ స్థాయిలో అధికారంలోకి వస్తారో చూడాలని అభిమానులు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

అంతేకాదు అధికార పార్టీపై పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పలు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత తెరకెక్కించిన చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సమయంలో టికెట్ల రేట్లు కూడా తగ్గించాలని జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు ఏకంగా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయినట్లు సమాచారం.

అధికార పార్టీ పెట్టిన జీవో వల్ల అఖండ, పుష్ప సినిమాలకు కూడా భారీగా నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రితో భేటీ అయి సమస్యను పరిష్కరించారు. తన సినిమాలను ఆ విధంగా తొక్కేయడంపై పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన యువశక్తి మహాసభలో మాట్లాడుతూ.. అసలు విషయాన్నీ తెలిపారు..” నన్ను ఎన్ని విధాలుగా మీరు భయపెట్టాలని చూసినా.. నా సినిమాలను అణిచివేయాలని చూసినా నేను ఎవరికీ భయపడను, భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా అని ఆపేయాలని చూసిన నిర్మాతలకు 30 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.. ఆ నష్టాన్ని నేను భరించాను. ఇవన్నీ నాకు ఒక లెక్క కాదు.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నా చేత వెనుకడుగు వేయించలేరు” అంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇలా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి రావడం నిజంగా బాధాకరమైన చెప్పాలి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన సినిమాలతో ముందడుగు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *