ఇటీవలే కాలంలో వచ్చే సినిమాలు యూత్ ఆకట్టుకుంటూ మంచి వసూళ్లను సంపాదించుకుంటున్నాయి. ఆ విధంగా క్రైమ్ కామెడీ తో పాటు Raajahyogam Review : నటీ నటులు :అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు
సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
సంగీతం – అరుణ్ మురళీధరన్
నిర్మాత – మణి లక్ష్మణ్ రావు,
సహ నిర్మాతలు – డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్,
రచన దర్శకత్వం – రామ్ గణపతి.
విడుదల : 30.12.2022

యూత్ ఆకట్టుకునే ఎన్నో అంశాలున్నా చిత్రం “రాజయోగం”. రామ్ గణపతి దర్శకత్వంలో శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ స్థాయి లో ఆకట్టుకుందో తెలియాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కార్ మెకానిక్ గా పనిచేసే రిషి (సాయి రోనక్) గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కలలు కంటాడు. ఒక కారును డెలివరీ ఇవ్వడానికి ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లగా కార్ ఓనర్ నాలుగు రోజులు రాడని తెలిసి ఆ హోటల్ లో ఆ ఓనర్ లాగా ఉండిపోతాడు. అక్కడే రిషి కి శ్రీ (అంకిత సాహు) పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ప్రేమించి లైఫ్ సెటిల్ అవ్వాలని ఆమెతో స్పెండ్ చేస్తాడు. అతనికి ఫ్లాట్ అయినా శ్రీ ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే అసలు విషయం తెలిసి శ్రీ రిషి కి బ్రేకప్ చెబుతుంది. అదే సమయంలో యాభై వేళా కోట్ల వజ్రాన్ని చేజిక్కుంచుకోవడానికి రాధా (అజయ్ ఘోష్) తిరుగుతుండగా దానికోసం శ్రీ కూడా అతనికి దగ్గరవుతుంది. ఈ విషయం తెలుసుకున్న రిషి సరికి డబ్బు కంటే ప్రేమే గొప్పది అని చెప్పాలని చూస్తాడు. ఆ తరువాత జరిగే పరిణామాలేంటి అనేదే ఈ సినిమా.

నటీనటులు :

హీరో సాయి రోనక్ ఓ మిడిల్ క్లాస్ మెకానిక్ గా బాగా ఆకట్టుకుంటాడు. డ్యాన్సులు ఫైట్స్, రొమాన్స్, లిప్ లాక్ సీన్స్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్ లో చాలా బాగా నటించి మెప్పించాడు.తన పాత్రకు న్యాయం చేశారు. యాక్షన్ సన్నివేశాలలో మంచి పరిణితి కనిపించాడు. హీరోయిన్ అంకిత వైవిధ్యమైన పాత్రలో గ్లామరస్ గా నటించి ఆకట్టుకుంది. డిఫరెంట్ బోల్డ్ పాత్రలో కనిపించి యువతలో మంచి గుర్తింపు దక్కించుకుంది. లిప్ లాక్, రొమాన్స్ చేసే విషయంలో ఎక్కడా తగ్గలేదు. షకలక శంకర్, తాగుబోతు రమేష్ కామెడీ సీన్స్ బాగున్నాయి. విలన్ పాత్రలో నటించిన అజయ్ ఘోష్ ఎప్పటిలాగే బాగా నటించాడు. భద్రం, ప్రవీణ్, గిరి పాత్రలు ఆకట్టుకున్నాయి.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడి కి కథ పట్ల ఉన్న నమ్మకం సినిమా అవుట్ ఫుట్ లో కనిపించింది. రొమాంటిక్ క్రైం కామెడీ ని ఎలా చేయాలో అలా చేసి మొదట్లోనే సక్సెస్ సాధించాడు. చాలా మంది కమెడియన్స్ పెట్టుకొని 30 రోజుల్లో సినిమా చేయడమనేది బిగ్ చాలెంజ్ అక్కడే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఆద్యంతం ప్రేక్షకులకు నచ్చేలా ఎంగేజ్ చేయడంలో సఫలీకృతం అయ్యాడు దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ అరుణ మురళీధరన్ సంగీతం బాగుంది.పాల్ ప్రవీణ్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు ఈ సినిమా ను నిర్మించారని స్క్రీన్ ప్రజెన్స్ ను బట్టి తెలుస్తుంది.

తీర్పు : క్రైమ్, ఎమోషన్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ బాగా పండాయి. ప్రేక్షకులు తప్పకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారని కచ్చితంగా చెప్పవచ్చు.(Raajahyogam Review)

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed