దర్శకుడు శ్రీనివాస్ ప్ర‌భ‌న్, పూజ జంటగా… ముస్తఫా అస్కరి, రోషన్, సాయిశ్రీ, ఇందు ప్రధాన పాత్ర ధారులుగా నటించిన చిత్రం ‘అరంగేట్రం’. మ‌హి మీడియా వ‌ర్క్స్ పతాకంపై శ్రీనివాస్ ప్ర‌భ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్వ‌రి కె. ఈ చిత్రాన్ని నిర్మించారు. సైకో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మే 5న విడుదలైంది. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘కవచం’ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ ప్రభన్… మరి ఇసారి ఓ డిఫరెంట్ జోనర్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వచ్చారు. మరి ఈచిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం థ్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.

కథ: ప్రభన్(శ్రీనివాస్ ప్రభన్) ఓ అనాథ. తల్లి చనిపోడంతో చదువును మధ్యలోనే ఆపేసి… పెయింటింగ్స్ వేస్తూ జీవిన సాగిస్తూ ఉంటారు. అతడు చిన్నతనంలోనే మేఘన(పూజ)ని ప్రేమిస్తాడు. తల్లి చనిపోవడంతో ఆ ప్రేమ విఫలం అవుతుంది. దాంతో ఆ చిన్నప్పటి ప్రేమ తాలూకు జ్ఞాపకాలు అతనిని వెంటాడుతూ ఉంటాయి. మేఘననే సర్వస్వం అని బతికేస్తూ ఉంటాడు. అలాంటి మేఘన అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. ఈ మరణం వెనుక ఉన్నది ఎవరు… అతని మోటివ్ ఏంటి అనే యాంగిల్ లో పోలీసులకంటే వేగంగా ఆ మరణం వెనుక ఉన్న వ్యక్తి ఆచూకీని ఎలా కనుగొన్నాడు? ఆ సైకో వ్యక్తి ఆటను ఎలా కట్టించాడు అనేదే మిగతా కథ.

కథ… కథనం విశ్లేషణ: తాజాగా తెరకెక్కిన ‘అరంగేట్రం’ చిత్రం కూడా ఇలాంటి సినిమానే. ఈ చిత్రంలో దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ యే… మెయిన్ లీడ్ హీరోగా నటించి దర్శకత్వం వహించారు. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ నటించిన ‘కవచం’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన… ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలతో పాటు… హీరోగా కూడా ఈ చిత్రంతో ‘అరంగేట్రం’ చేశారు. చాలా గ్రిప్పింగ్ కథ, కథనాలతో ఓ ఇంట్రెస్టింగ్ క్రైం సస్పెన్స్ సైకో థ్రిల్లర్ స్క్రిప్ట్ ని రాసుకుని… సెల్యులాయిడ్ పై ఆవిష్కరించారు. సినిమా మొదలైనప్పటి నుంచి శుభం కార్డు వరకు ఎక్కడా డీవియేట్ కాకుండా… తాను రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లేను చాలా గ్రిప్పింగ్ గా తెరమీద చూపించారు. ఫస్ట్ హాఫ్ లో ఓ సైకో చేతిలో అమ్మాయిలు దారుణంగా వరుసగా చంపబడుతుంటారు. దాని వెనక ఉన్న మొటీవ్ ని ఛేదించడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు… తరువాత హీరో పాత్ర కూడా ఓ సస్పెక్ట్ గా ఎంట్రీ ఇవ్వడం… ఇంటర్వెల్ బ్యాంగ్ లో అసలు సైకో పాత్రను రివీల్ చేయడం.. లాంటి ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే… సెకెండాఫ్ పై ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్ ని పెంచేస్తుంది. ఈ పాత్రల్లో ఎక్కడా స్టార్ కాస్ట్ కనిపించదు. కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయంటే… స్టోరీ, స్క్రీన్ ప్లేలో ఎంత గ్రిప్పింగ్ గా ఉందో అర్థమవుతుంది. ఇక సెకెండాఫ్ లో సైకో చేస్తున్న వరుస హత్యల వెనుక దాగివున్న మొటీవ్ ను కూడా ఇందులో డిఫరెంట్ గా చూపించడం ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా వుంది. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలపట్ల ఎలా వ్యవహిరంచ కూడదు, అక్రమ సంబంధాల వల్ల విడిపోయిన తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది అనేది ఓ మెసేజ్ రూపంలో కూడా ఇచ్చాడు దర్శకుడు. ఫైనల్ గా ‘అరంగేట్రం’ మూవీ… ఇలాంటి జోనర్ ని ఇష్టపడే వాళ్లని అలరిస్తుంది.

దర్శకుడే హీరోగా కూడా నటించి… కథ, కథనాలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో శ్రీనివాస ప్రభన్ విజయం సాధించారు. అలాగే తనతో పాటు నటించిన వారిని కూడా ఎంగేజ్ చేయడంలో ప్రభన్ ప్రతిభను మెచ్చుకోవాలి. ముఖ్యంగా సైకో పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. నటుడు ముస్త‌ఫా అస్క‌రి సైకో పాత్రను బాగా లీడ్ చేశారు. అందుకు తగ్గట్టుగా తన మేకవర్ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే సైకో పాత్రలో చైల్డ్ క్యారెక్టర్ పోషించిన రోషన్ మరోసారి మెప్పించాడు. ఇటీవల విడుదలై బ్లక్ బస్టర్ సాధించిన ‘విరూపాక్ష’ చిత్రంలోనూ విలన్ పాత్రను ఫ్లాష్ బ్యాక్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎంత బాగా ఆకట్టుకున్నాడో… ఇందులో కూడా ఇంచు మించు అలాంటి పాత్రలోనే ఓ డిఫరెంట్ యాంగిల్ లో కనిపించి మెప్పించాడు. హీరోయిన్ పూజా పాత్ర కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఆకట్టుకుంటుంది. జర్నలిస్ట్ గా… సంయుక్త పాత్రలో కనిపించిన సాయిశ్రీ పర్వాలేదు అనిపించింది. ఎసీ మెకానిక్ పాత్రలో కనిపించిన అనిరుధ్ కి, సైకోకి మధ్య జరిగే బేతాళ, విక్రమార్కుడి కథ ఎపిసోడ్ ఆడియన్స్ ని కుర్చీలోని కదలనీయకుండా చేస్తుంది. ఇదే ఎపిసోడ్ లో మధ్య మధ్యలో కామెడీ డైలాగులతో నవ్వించే ఆర్టిస్ట్ పాత్రను బాగానే డిజైన్ చేశారు. ఇక ఆయనకు జోడీగా నటించిన ఆమె, ఆమె చెల్లెలుగా వైష్ణవి పాత్రలో నటించిన విజయ, స్పెషల్ పోలీసు ఆఫీసర్, తదితర పాత్రలు ఓకే. రోషన్ తల్లిగా నటించిన ఆమె పాత్ర బాగుంది.

ఈ చిత్రానికి పెద్ద అస్సెట్… బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అది ప్రతి సీన్ ని బాగా ఎలివేట్ చేసింది. సంగీత దర్శకుడు గిడియాన్ క‌ట్టా అందించిన ప్రతి సన్నివేషంలోనూ తన ప్రతిభను చూపారు. ముఖ్యంగా సైకో కిల్లింగ్ ఎపిసోడ్స్ లో థ్రిల్లర్ మూవీస్ చూసేటప్పుడు ఎలాంటి మూడ్ ఉండాలో అలాంటి నేపథ్య సంగీతంతో ఆడియన్స్ ని కట్టిపడేశాడు మ్యూజిక్ డైరెక్టర్ బుర‌న్ షేక్‌(స‌లీమ్‌). బుర‌న్ షేక్‌(స‌లీమ్‌) అందించిన సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది. ఇక ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రధాన భూమిక పోషించింది ఎడిటింగ్. ఇంత గ్రిప్పింగ్ గా సినిమాని కుదించడంలో ఎడిటర్ మధుని మెచ్చుకుని తీరాల్సిందే. ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాని ఎడిట్ చేయడంలో మధు సక్సెస్ అయ్యారు. ఇంత బాగా సినిమా రావడానికి కో-డైరెక్టర్ కం ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ ర‌మేష్ బాబు చిన్నం(గోపి) కృషిని… సినిమాని ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా తీసిన నిర్మాత మ‌హేశ్వ‌రి.కెని అభినందించాలి. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. తప్పకుండ థియేటర్ కి వెళ్లి చూడగల సినిమా

రేటింగ్: 2.75

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed