Varasudu Review

Varasudu Review:

నటీనటులు : విజయ్ దళపతి, రష్మిక మందాన, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సంగీత, యోగిబాబు తదితరులు
ఎడిటింగ్: ప్రవీణ్ కే ఎల్
సినిమాటోగ్రఫీ : కార్తీక్ పలని
మ్యూజిక్ : ఎస్. ఎస్. తమన్
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
విడుదల తేదీ : 14 జనవరి 2023

విజయ్ దళపతి హీరో గా నటించిన వారసుడు సినిమా తెలుగు లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో రెండు రోజుల ముందుగానే విడుదల అయిన ఈ సినిమా తెలుగు లో ఆలస్యంగా రాబోతుంది. సినిమా పాటలతో, ట్రైలర్ తో ఎంతో ఆసక్తి పరచగా అంచనాలు గట్టిగానే పెరిగిపోయాయి. దానికి తోడు తెలుగు దర్శకుడు, నిర్మాత తమిళ హీరో తో సినిమా చేస్తుండడంతో ఈ చిత్రం పై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. ఆ విధంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయి లో ఆకట్టుకుంటుందో ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ

రాజేంద్ర (శరత్ కుమార్) కోటీశ్వరుడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. జై (శ్రీకాంత్), అజయ్ (కిక్ శామ్), విజయ్ (విజయ్). ఇక ఈ లగ్జరీ జీవితానికి, తండ్రి వారసత్వానికి విజయ్ దూరంగా ఉంటాడు. ఏడేళ్ల తరువాత విజయ్ మళ్లీ ఇంటికి వస్తాడు. అమ్మ పిలుపుతో విజయ్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. అయితే రాజేంద్ర క్యాన్సర్‌తో బాధపడుతుంటాడు. కొద్ది రోజుల్లోనే చనిపోతాడని తెలుసుకుంటాడు. అలాంటి సమయంలో తన పెద్ద కొడుకులు తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అర్హత లేదని తెలుసుకుంటాడు. తన చిన్న కొడుకు విజయ్‌ని వారసుడిగా ప్రకటిస్తాడు. ఆ తరువాత తన అన్నల నుంచి విజయ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ముక్కలైన కుటుంబాన్ని ఒక్కటి చేయడానికి విజయ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? కుటుంబంలో సమస్యలు పుట్టించేందుకు జయ ప్రకాష్‌ (ప్రకాష్‌ రాజ్) చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు విజయ్ తన కుటుంబాన్ని ఒక్కటి చేశాడా? అన్నది కథ.

నటీనటులు

ఫ్యామిలీ ఎమోషన్స్ పండించే పాత్ర లో విజయ్ నటించి చాలా రోజులైపోయింది. అలాంటి ఈ సినిమా లోని హీరో పాత్ర లో విజయ్ చక్కగా ఒదిగిపోయాడు. సినిమా ను తన భుజాలపై నడిపించాడు. అన్ని రకాల యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ తో, యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొట్టాడు. ఇక గ్లామర్ పరంగా రష్మిక పాత్ర సినిమా కు బాగా ఉపయోగపడింది. నటనలోనే విజయ్ కు ఏమాత్రం తగ్గకుండా నటించింది. ఆమె నిడివి చిన్నదే అయినప్పటికీ ఆమె కు మంచి ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. ఇక సినిమాలో ఇతర పాత్రధారులైనా శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సంగీత లు తమ పాత్ర ల పరిధి మేరకు ఎంతో బాగా ఆకట్టుకున్నారు. విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ తన నటన తో మరోసారి ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణులు

మొదటి నుంచి దర్శకుడు వంశీ పైడిపల్లి బలం కథ రాసుకునే విధానం. తన ప్రతి సినిమా లో ఇది ఎంతో బలంగా ఉంటుంది. ఈ సినిమా లో కూడా ఫ్యామిలీ ని ఆకట్టుకునే అంశాలు బాగున్నాయి. ఈ తరం వారికి కుటుంబ విలువలను నేర్పించే కథతో ఆకట్టుకున్నాడు. క్లియర్ కట్ స్క్రీన్ ప్లే, క్వాలిటీ దర్శకత్వం ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం అయ్యింది. వంశీ పైడిపల్లి టెక్నికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. సంగీతం పరంగా తమన్ మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతం లోనూ తన ప్రతిభ చాటాడు. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.(Varasudu Review)

ప్లస్ పాయింట్స్

విజయ్ యాక్టింగ్‌

కామెడీ వన్ లైనర్స్

సంగీతం

మైనస్ పాయింట్స్

సెంటిమెంట్ ఎక్కువవ్వడం

అక్కడ నెమ్మదిగా సాగే సీన్స్

తీర్పు:

విజయ్ దళపతి నటించిన ఈ వారసుడు సినిమా ఫ్యామిలీ లవర్స్ కి ఎంతో నచ్చుతుంది. ఫ్యామిలీ అందరు కలిసి చూడదగ్గ సినిమా ఇది. ఇటీవలే కాలంలో ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ సంక్రాంతికి అందరు చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్ : 2.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed