Thegimpu ReviewThegimpu Review:

నటీనటులు : అజిత్ కుమార్ , మంజూ వారియర్, సముద్ర ఖని, పావనిరెడ్డి, జాన్ కొక్కెన్, అజయ్ తదితరులు
దర్శకుడు : హెచ్. వినోద్
మ్యూజిక్ : గిబ్రాన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
నిర్మాత : బోనీ కపూర్
విడుదల తేదీ : 11 జనవరి 2023

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తెగింపు ఈ రోజు తమిళంతో పాటు తెలుగు లో కూడా విడుదలైంది. వరుస చిత్రాలతో విజయాలు అందుకుంటున్న ఈ హీరో చేస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది. అప్డేట్ లతో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని గ్రాబ్ చేసిన ఈ చిత్రం పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా గా రూపొందగా ఈ సినిమా ఎలా ఉందొ ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ

వైజాగ్ లో పేరున్న బ్యాంకు ను దోచుకోవడానికి ప్లాన్ చేస్తుంది ఓ గ్యాంగ్. ఈ గ్యాంగ్ కి లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సహాయం కూడా ఉంటుంది. ప్లాన్ ప్రకారం వారు బ్యాంకు లోకి వెళతారు. కానీ అప్పటికే ఆ బ్యాంకు ను దోచుకోవడానికి డార్క్ డెవిల్ (అజిత్) అక్కడికి వస్తాడు. దీంతో గ్యాంగ్ కూడా అతనికింద హోస్ట్ లుగా ఉంటారు. అయితే బ్యాంకు ను దోచుకోవడానికి వచ్చిన డెవిల్ డబ్బు తీసుకుని వెళ్లకుండా ఆ బ్యాంకు ఓనర్ ని రమ్మని పోలీసులను హెచ్చరిస్తాడు. ఈలోపు ఆ బ్యాంకు లో మూడో గ్యాంగ్ కూడా బ్యాంకు ను దోచుకోవడానికి వచ్చిందని తెలుసుకుంటాడు. మరి ఆ మూడో గ్యాంగ్ ఎవరు? డార్క్ డెవిల్ ఆ బ్యాంకు ను ఎందుకు దోచుకోవడానికి వచ్చాడు అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు

అజిత్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. రెగ్యులర్ హీరో లా కాకుండా కాస్త విలనిజం ఉన్న హీరోలా ఆయన ఈ చిత్రంలో కనిపించారు. గతంలో ఆయన్ని ఇలాంటి లుక్ లో చూడలేదని చెప్పాలి. అయన మేకోవర్ కోసం బాగానే కష్టపడ్డాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం లో మరో హైలైట్ పాత్ర చేసింది మంజూ వారియర్. యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. అజిత్ సహచర నటిగా బాగా నటించింది. ఇక సముద్ర ఖని పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకున్నాడు. అజయ్, జాన్ కొక్కెన్ లు విలన్స్ గా ఆకట్టుకున్నారు. మిగితా పాత్రధారులు తమ పరిధిమేరకు బాగా నటించారు.

సాంకేతిక నిపుణులు

ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు తెరకెక్కించిన విధానం. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఆయన ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. కథ లో పలు ట్విస్ట్ లు అందరిని ఆసక్తి పరుస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అందరిని ఆశ్చర్య పరుస్తుందని. బ్యాంకు లోపల సీన్స్ చాలా బాగుంటాయి. రెండు గంటలు ఒకే లొకేషన్ లో సినిమా నడిపించిన విధానం బాగుంది. ఇక్కడ ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలు తమ పరిధిమేరకు పనిచేశాయి. నేపథ్య సంగీతం అందించడం లో గిబ్రాన్ సఫలం అయ్యాడు. పాటలకు పెద్దగా చోటు లేకపోయినా అజిత్ ఇంట్రో సాంగ్ బాగుంది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమా యొక్క నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.(Thegimpu Review)

ప్లస్ పాయింట్స్ :

అజిత్

దర్శకత్వం

ట్విస్ట్స్

మైనస్ పాయింట్స్ :

పాటలు లేకపోవడం

అక్కడక్కడా నెమ్మదించడం

తీర్పు : యాక్షన్ సినిమాలను అభిమానించే ప్రేక్షకులకు ఎంతో నచ్చుతుంది. ముఖ్యంగా అజిత్ అభిమానులకు ఐ ఫీస్ట్ లాంటి సినిమా. అజిత్ స్టైలిష్ లుక్, స్టైలిష్ యాక్షన్ వెరసి ఈ సినిమా తప్పకుండ అందరికి నచ్చుతుంది. పండగ సినిమాలలో విడుదలైన మొదటి సినిమా పండగ వాతావరణాన్ని తెచ్చింది.

రేటింగ్ : 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed