Vasuki pakijaVasuki pakija.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఊహించడం కష్టం. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో స్టార్డం చూసినవారు ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా దీన స్థితిలో తారసపడుతున్నారు. ఎప్పుడో సినిమాలు వదిలేసినప్పటికీ.. ఇన్నాళ్లు ఏమైపోయారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాలు చేసి చివరికి చేతిలో ఒక్క సినిమా లేక.. డబ్బు లేక .. తినడానికి తిండి లేక.. పూట గడవడమే కష్టంగా మారిందనే మాటలు ప్రేక్షకులను కలచివేస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో చాలామంది సీనియర్ నటులు ఇలాంటి దీన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి (Vasuki pakija) కూడా ఒకరు. ఈమె గురించి 1980 – 90 మధ్య ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాలు, ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న పాకీజా ఇప్పుడు తిండి లేక నానా అవస్థలు పడుతున్నారట. చాలా సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి.. సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకొని తనకంటూ ఏమీ లేకుండా చేసుకుని అనాధగా మిగిలింది.

తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..” తెలుగులో యాభై సినిమాలు చేశాను. ఎన్టీఆర్, ఏఎన్నార్ , బాలయ్య, మోహన్ బాబు ఇలా అప్పటి స్టార్ హీరోల అందరి సినిమాలలో కూడా పనిచేశాను. సినిమాలు ఆపేశాక నా సొంత ఊరు కారైకుడికి వెళ్లిపోయా. నాకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్ అంటే జయలలిత మాత్రమే. కొన్నాళ్లుగా ఆర్థిక పరిస్థితి బాలేదు. 150 సినిమాలు చేసినా చెన్నైలో సొంత ఇల్లు కట్టుకోలేకపోయాను. హెల్ప్ కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు అందరి హీరోలను సంప్రదించాను.

చివరికి సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి కూడా నా పరిస్థితి వివరించాను. ఎవరు హెల్ప్ చేయలేదు. ప్రస్తుతం హాస్టల్లో ఉంటూ జీవితం కొనసాగిస్తున్నాను ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఎదురుచూస్తున్నాను” అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం నిన్నటి పాకీజా నేడు ఇలా దీనస్థితిలో చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *