ChiranjeeviChiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలలోకి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో కూడా ఆయన రేంజ్ ఎక్కడా కూడా తగ్గలేదు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేకపోయాయి.. కానీ ఏ రోజూ కూడా నటన విషయంలో మెగాస్టార్ పై నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదు. కంటెంట్ ఇంకా పాత తరహాలోనే ఉండడంతో జనాలు చిరంజీవి సినిమాపై ఫోకస్ పెట్టడం తగ్గించారు. ఇకపోతే ఇప్పటికీ కూడా ఆయన తన పాత స్టైల్ లోనే సినిమాలను తెరపైకి తీసుకొస్తూ ఉండడం విశేషం.

ఇకపోతే చిరంజీవి గత నాలుగు సినిమాలకు సంబంధించిన బిజినెస్ ట్రాక్ ఎంతవరకు వెళ్ళింది.. అలాగే ఇప్పుడు వాల్తేరు వీరయ్య బిజినెస్ ఎంత జరిగింది అనే విషయానికి వస్తే… ఖైదీ నెంబర్ 150 సినిమా రూ.89 కోట్ల వరకు థియేటర్ బిజినెస్ చేయగా ఈ సినిమా టార్గెట్ అయితే తొందరగానే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా రూ.195 కోట్ల బిజినెస్ చేసింది. కానీ చాలా ఏరియాలలో ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. ఆచార్య సినిమా రూ. 136 కోట్ల వరకు బిజినెస్ చేయగా.. దాదాపు రూ.90 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. అంతే కాదు మెగాస్టార్ కెరియర్ లోనే ఇదొక అత్యంత దారుణమైన డిజాస్టర్ చిత్రం అని చెప్పవచ్చు.

ఇకపోతే గాడ్ ఫాదర్ సినిమా రూ.90 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కానీ ఆ సినిమా టార్గెట్ మాత్రం పూర్తి చేయలేకపోయింది. అయితే కేవలం కొంత నష్టాలతో మాత్రమే తప్పించుకుంది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా రూ.88 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టుగా సమాచారం. ఇప్పుడు జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ టార్గెట్ ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పూర్తి చేస్తారో లేదో చూడాలి. మరొకవైపు ఈ సినిమాపై చిత్ర బృందమే కాదు.. అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *