గాడ్ ఫాదర్ కు మంచి కలెక్షన్స్ వచ్చాయిగా!!

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా లో నయనతార ముఖ్య పాత్ర లో నటించగా అతిధి పాత్ర లో సల్మాన్ ఖాన్ నటించడం ఈ సినిమా కు ప్లస్ అయ్యింది.

తాజాగా ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే ఈ సినిమా 145.24 కోట్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏదేమైనా మొదట ఈ సినిమా కు నెగెటివ్ టాక్ వచ్చినా కూడా ఫైనల్ గా ఈ సినిమా కు మంచి కలెక్షన్స్ రావడం నిజంగా మంచి విషయం అని చెప్పాలి. ‘ఆచార్య’ సినిమా వలన కలిగిన అసంతృప్తికి ‘గాడ్ ఫాదర్’ సమాధానం చెబుతుందని చిరంజీవి చెప్పినట్టుగానే జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *