టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్ గురించి ఆయన తెలివి గురించి, ఫైనాన్షియల్ థాట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలకు, రాజకీయ నాయకులకు చాలా కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. కుల, మతాలను పట్టించుకోకుండా.. కులాంతర , మతాంతర వివాహాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా తమకు నచ్చిన అమ్మాయిలను.. ఏ కులమైనా సరే.. ఏ మతమైనా సరే ఏమాత్రం చూసుకోకుండా పెళ్లి చేసుకుని చక్కని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

Allu Arjun Marriage | Veethi
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అరవింద్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన కొడుకు అల్లు అర్జున్ తెలుగు తెరపై పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వందల కోట్లతో సినిమాలను తెరకెక్కించే అల్లు అర్జున్ కి మాత్రం అల్లు అరవింద్.. తనకు నచ్చిన విధంగా తెలంగాణ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అల్లు అరవింద్ తన ఆస్తులతో సమానంగా ఉండే వియ్యంకుడినే తెచ్చుకోవడం గమనార్హం. ఇక అల్లు అర్జున్ కు పిల్లనిచ్చింది కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాకు చెందిన వీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. పలు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.

చంద్రశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా కేసీఆర్ , కేటీఆర్లకు మంచి సన్నిహితుడు కూడా . ఈ చొరవ తోనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ లకు ప్రభుత్వ పరంగా ఏ అవసరం వచ్చినా సరే మామ చంద్రశేఖర్ రెడ్డి ముందుండు మరీ తీరుస్తాడు. ఇక అందుకే ఇలా రాజకీయపరమైన సంబంధాన్ని పెంచుకోవడం కోసం ఇలా పెద్ద స్కెచ్ వేసి మరి.. అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ కు వివాహం జరిపించారు.

ఆర్థికంగా , రాజకీయపరంగా ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే ఆదుకోవడానికి బలగం ఉండాలి అన్న నేపథ్యంలోనే ఇలా కొడుకు పెళ్లి ని కూడా వాడుకొని తన బలగాన్ని పెంచుకున్నాడు అల్లు అరవింద్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా అల్లు అరవింద్ ముందస్తు జాగ్రత్తగా చేసే ప్రతి ప్లాను కూడా సక్సెస్ అవుతుందని అలాగే వారికి లాభదాయకంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *