ఆదిపురుష్ పై ట్రోలింగ్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్!!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండగ వచ్చేసింది. ఆది పురుష్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ కోసం అందరు ఎంతో ఎదురుచూడగా అది నిన్న విడుదల అవడం ప్రభాస్ అభిమానులను ఎంతో కిక్ ఇచ్చింది. ‘ఆది పురుష్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర దర్శకుడు ఓం రౌత్ శుక్రవారం ఉదయం రిలీజ్ చేశాడు. ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ 2 న విడుదల చేయబోతున్నారు. అయోగ్య లో ఓ భారీ ఈవెంట్ లో దీనిని విడుదల చేయబోతున్నారు.

ఈ విధంగా విడుదల కాబోతున్న సినిమా ఇదే అని చెప్పాలి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న ప్రభాస్.. ఆకాశానికి విల్లును ఎక్కు పెట్టిన పోస్ట్ అద్భుతంగా ఉంది. ప్రభాస్ అభిమానులు ఏదైతే కోరుకున్నారో అలాంటి పోస్టర్ విడుదలై వారి ఆనందానికి అవధులు లేకుండా చేసింది. పొడవాటి జుట్టు, భుజాలకు రుద్రాక్షలు ధరించిన ప్రభాస్ చాలా గంభీరంగా, పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. అయన లుక్ ను ఎంతో బాగా డిజైన్ చేశారని చెప్పాలి. అయితే ఈ లుక్ ను రామ్ చరణ్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ పెట్టిన బాణం ఫోజ్ ను పెట్టి ప్రభాస్ కంటే చరణ్ ఫోజ్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రభాస్ అభిమానులు దీన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజులుగా సినిమా హీరో ల అభిమానుల మధ్య ఇలాంటి వార్స్ జరగడం నార్మల్ అయిపొయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *