స్టార్ హీరోలంటే వందల కోట్ల రూపాయలు సంపాదిస్తారని అనుకుంటాం. కానీ అది అందరు హీరోల విషయంలో జరగదు. తన రెమ్యునరేషన్, సంపాదన విషయంలో బయట అనుకునేవి నిజం కాదని చెప్పారు హీరో విజయ్ దేవరకొండ. ఖుషి సినిమా వరకు తాను పెద్ద మొత్తంలో డబ్బులు చూడలేదన్నారు. ఖుషి సినిమా నుంచే తనకు కావాల్సినంత డబ్బు కనిపిస్తోందన్నారు. ఇవాళ జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ తన ఫీజు గురించి మాట్లాడారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – నేను ఇంత తీసుకున్నా, అంత తీసుకున్నా అని సోషల్ మీడియాలో చూస్తుంటా. కానీ నిజం నాకు మాత్రమే తెలుసు. నేను ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోను కాదు. ఔట్ సైడర్ ను. ఒక ఔట్ సైడర్ గా ముందు పేరు కోసమే ఆలోచిస్తా. నాకంటూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అనుకున్నా. ఖుషి సినిమా ముందు వరకు నేను తీసుకున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఖుషి నుంచే కాస్త డబ్బులు సంపాదిస్తున్నా. కోవిడ్ టైమ్ లో నా స్టాఫ్ జీతాలు, మెయింటనెన్స్ ఇవన్నింటికీ ఇబ్బంది కలిగింది. అప్పటి నుంచి మన మార్కెట్ వ్యాల్యూకు తగినట్లు ఫీజు తీసుకోవాలి అనుకుని ఫిక్స్ అయ్యా. ప్రొడ్యూసర్స్ కు ఇబ్బంది కలగకుండా వాళ్లకు నేను చేసే ప్రాజెక్ట్ ద్వారా వచ్చే దాంట్లో న్యాయంగా నాకు ఇవ్వాల్సింది మాత్రమే తీసుకుంటున్నా. అని క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *