డిఫరెంట్ మూవీస్ చేస్తూ టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సుహాస్. ఆయన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు కూడా మంచి సక్సెస్ అయ్యింది. ఇదే జోరులో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు సుహాస్. ఈ క్రమంలో ఆయన చేస్తున్న ఓ వెబ్ సిరీస్ సినీ ప్రియులను సర్ ప్రైజ్ చేస్తోంది. ఉప్ప కప్పు రంబు పేరుతో దర్శకుడు ఏవీ శశి ఈ సిరీస్ ను రూపొందిస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో నిన్నిలా నిన్నిలా అనే సినిమా రూపొందించాడు.

అమోజాన్ ఒరిజినల్స్ గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్ ఓ కీ రోల్ చేస్తుండటం విశేషం. సుహాస్, కీర్తి సురేష్ కాంబోలో వెబ్ సిరీస్ వస్తోందంటే అది ఫిల్మ్ లవర్స్ కు ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే చెప్పాలి. సెటైరికల్ కామెడీ కథతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్ క్యారెక్టర్ ఇప్పటిదాకా చూడని విధంగా కొత్తగా ఉంటుందట. పలు సూపర్ హిట్ సినిమాల్లో స్టార్ హీరోలతో కలిసి నటించిన కీర్తి సురేష్ కీ రోల్ చేస్తుండటంతో ఉప్పు కప్పు రంబు వెబ్ సిరీస్ మీద ఆసక్తి ఏర్పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *