మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ హీరోగా నటిస్తున్నాడనే విషయంలో కొన్ని నెలలుగా ప్రచారంలో ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇళయరాజా సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. చెన్నై సెంట్రల్ స్టేషన్ సమీపంలో హార్మోనియం పెట్టె పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ధనుష్ ఫొటోను ఫస్ట్ లుక్ పోస్టర్ గా విడుదల చేశారు. ఈ పోస్టర్ లాంఛ్ కార్యక్రమంలో చెన్నైలో ఇళయరాజా, కమల్ హాసన్ చేతుల మీదుగా జరిగింది.

ఇళయరాజా సినిమాను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ మూవీస్, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ సినిమాను రూపొందించిన దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాను కూడా రూపొందిస్తున్నారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి సంగీతం మీద ప్రేమతో లెజెండ్ గా ఎదిగిన ఇళయరాజా జీవితాన్ని ఈ సినిమా తెరపై చూపించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed