ఈ నెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. రామ్ చరణ్ ఇవాళ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించే సినిమాను లాంఛ్ చేశారు. ఆయన చేతిలో గేమ్ ఛేంజర్ సినిమా ఉంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఆయన పుట్టినరోజున రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. అలాగే ఆర్ సీ 16 నుంచి ఓ గ్లింప్స్ తో రామ్ చరణ్ కు బర్త్ డే విశెస్ తెలియజేయనున్నారు.

ఇలా ఈ రెండు సినిమాల నుంచి చరణ్ బర్త్ డే స్పెషల్ అప్డేట్స్ ఉండబోతున్నాయి. వీటితో పాటే రామ్ చరణ్ కొత్త సినిమాల ప్రకటన ఉంటుందనే చర్చ నడుస్తోంది. వీటిలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త సినిమా అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ సుకుమార్ రంగస్థలం సినిా చేశారు. ఈ సినిమా చరణ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మారింది. ఈ క్రేజీ కాంబోలో సినిమా ప్రకటిస్తే మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed