విశ్వక్ సేన్ హీరోగా నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ గామి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీ నుంచి జీ5 యాప్ లో గామి స్ట్రీమింగ్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయాల్సిఉంది. మార్చి 8న గామి సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. థియేటర్స్ లో ఈ సినిమా బాగా పర్ఫార్మ్ చేసింది.

క్రిటిక్స్ కూడా అప్రిషియేషన్స్ ఇచ్చారు. అయినా గామికి వచ్చిన పేరుకు తగినంత కలెక్షన్స్ రాలేదనే అసంతృప్తి మూవీ టీమ్ లో ఉంది. అయితే దర్శకుడు విద్యాధర్ కాగిత ప్రతిభ టాలీవుడ్ కు తెలిసింది. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ను ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశాడనే పేరు తెచ్చుకున్నాడు విద్యాధర్. అటు హీరో విశ్వక్ సేన్ కూడా ఇప్పటిదాకా తను చేయని క్యారెక్టర్ లో నటించి ప్రశంసలు పొందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *