Sanpeep Kishan

Sanpeep Kishan: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి పక్కపక్కనే కూర్చుని కాస్త క్లోజ్ గా మాట్లాడుకుంటే చాలు వారి మధ్య ఏదో ఉందని అల్లేస్తూ ఉంటారు జనాలు. ఇక ఈ విషయంలో ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లకు ఎఫైర్స్ అంటగట్టారు. కానీ సినీ ఇండస్ట్రీ జనాలు కూడా వారిని లైట్ గా తీసుకుంటారు. ఎందుకంటే తమ మధ్య ఏదీ లేనప్పుడు ఎవరు ఏమనుకుంటే మాకేంటి లే అంటూ భావిస్తారు.

కానీ కొంతమందయితే వారిపై సీరియస్ గా స్పందించి అసలు మామధ్య అలాంటిదేమీ లేదు అని చెప్పుకొస్తారు. తాజాగా సందీప్ కిషన్ రెజీనా మధ్య ఉన్న అనుబంధాన్ని హీరో సందీప్ కిషన్ వెల్లడించారు. ఇటీవలే సందీప్ కిషన్ మైఖేల్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్ (Sanpeep Kishan)  మాట్లాడుతూ.. నేను రెజీనా కలిసి నాలుగు సినిమాల్లో నటించాం. అందుకే మా మధ్య కాస్త క్లోజ్నెస్ ఉంది.

అయితే నాలుగు సినిమాల్లో కలిసి నటిస్తే ఎవరి మధ్యనైనా క్లోజ్నెస్ ఉంటుంది. కానీ అది మీరు వేరేలా అనుకుంటే మేమేం చేయగలం. కానీ మా మధ్య మాత్రం మీరు అనుకున్న విధంగా ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్పుకొచ్చాడు. మా మధ్య రిలేషన్ ఉండబట్టి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది.అయితే మా మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అయితే రెజీనా (Rejeena) బర్త్ డే కి మేమిద్దరం క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేస్తే అది మీరు తప్పుగా అనుకున్నారు.కానీ అలాంటి ఫోటోలు మా దగ్గర బోలెడు ఉన్నాయి.

చాలామంది క్లోజ్ గా ఉంటే ఫోటోలు తీసుకుంటారు.అలాగే మేము కూడా చాలానే ఫోటోలు దిగాం. మా ఇంట్లో వాళ్లకు కూడా రెజినా చాలా క్లోజ్ అయింది. ఆమె ముంబైలో షూటింగ్ చేసేటప్పుడు కాస్త లేట్ అయితే కచ్చితంగా మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది. కానీ మా మధ్య మీరు అనుకున్నట్లు వేరే ఎలాంటి రిలేషన్ లేదు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ సందీప్ కిషన్ (Sanpeep Kishan) తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తమ మీద వస్తున్న రూమర్లపై ఓ క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *