RemunerationRemuneration.. ప్రస్తుతం ఇటీవల కాలంలో సెలబ్రిటీ టాక్ షోలు బాగా పుట్టుకొస్తున్నాయి.. గతంలో బుల్లితెర పై మాత్రమే సెలబ్రిటీ టాక్ షోను నిర్వహించి వారికి సంబంధించిన ఎన్నో విషయాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ లు వచ్చిన తర్వాత అలాగే యూట్యూబ్ ఛానల్ వారు కూడా ఇలా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతోంది. ఒకప్పుడు సెలబ్రిటీలను ఇలా ఇంటర్వ్యూలు చేస్తే చాలా ఆసక్తిగా ఇంటర్వ్యూలను చూసేవారు ప్రేక్షకులు. కానీ ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు..

ఒకరకంగా చెప్పాలి అంటే ఈ సెలబ్రిటీ టాక్ షోలకి కూడా మంచి టిఆర్పి రేటింగ్ లభిస్తోందని చెప్పాలి. అయితే ఇలా యూట్యూబ్ ఛానల్ లకు, టాక్ షోలకు వచ్చి ఇంటర్వ్యూలలో పాల్గొనే అతిధులకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎంత మొత్తంలో ఇస్తారు? అనే విషయం పట్ల ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. మరోపక్క బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఆహాకు మంచి పబ్లిసిటీ రావడమే కాకుండా అంతకుమించి సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు..

ఇలా టాప్ సెలబ్రిటీలను టాక్ షోలకు పిలవడం వల్ల వారికి చాలా మంచి ఆదాయం కూడా ఉంటుందని.. పవన్ కళ్యాణ్ ,ప్రభాస్ , చంద్రబాబు నాయుడు వంటి సెలబ్రిటీలు రావడం వల్ల వీరికి కూడా పబ్లిసిటీ లభిస్తుందని చెబుతూ ఉంటారు. ఇకపోతే రెమ్యునరేషన్ విషయానికి వస్తే స్టార్ సెలబ్రిటీలు రెమ్యునరేషన్ లు తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ చిన్న చిన్న సెలబ్రిటీలు మాత్రం తప్పకుండా రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.

ఎంత పారితోషకం తీసుకుంటారని విషయానికి వస్తే.. సినిమాలకు తీసుకునే అంత రేంజ్ లో కాకపోయినా ఒక మోస్తారుగా పారితోషకం తీసుకుంటారని సమాచారం. కానీ ఎవరైనా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా సెలబ్రిటీ టాక్ షో లకి వస్తే మాత్రం నిర్వాహకులకే మనీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సెలబ్రిటీ టాక్ షో వల వల్ల పబ్లిసిటీ బాగా పెరుగుతుందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed