SreeleelaSreeleela.. కన్నడ యంగ్ హీరోయిన్ శ్రీ లీల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సినిమా సక్సెస్ అందించింది కానీ ఆ తర్వాత వరుస అవకాశాలు అందివ్వలేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది శ్రీ లీల (Sreeleela). ఈమె క్రేజ్ చూసి యంగ్ హీరోయిన్లే కాదు స్టార్ హీరోయిన్లు కూడా భయపడిపోతున్నారు. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈమెను చూసి వెనుకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా శ్రీ లీల (Sreeleela)అభిమానులు ఈమె విషయంలో ఎప్పటికప్పుడు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవల ఈమె మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. కానీ ఈ విషయంలో ఆమె తన అభిమానులను సంతృప్తి పరిచిందా లేదా అనే విషయానికి వస్తే.. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండడం కామన్ కానీ సెకండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.

అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీతనుమొదలుకొని అలవైకుంఠపురం సినిమాలో నటించిన సెకండ్ హీరోయిన్ నివేత పేతురాజు వరకు పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలోనే రెండవ హీరోయిన్ ను త్రివిక్రమ్ చూపించాడు. కాబట్టి మహేష్ బాబు(Maheshbabu) సినిమాలో కూడా శ్రీ లీలా పాత్ర కూరలో వేసిన కరివేపాకు మాదిరిగానే ఉంటుందని అందరూ భావించారు.

అయితే అందరూ అనుకుంటున్నట్టుగానే మహేష్ బాబు సినిమాలో శ్రీ లీలను చిన్న పాత్రలో చూపిస్తే ఖచ్చితంగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది.. అయితే ఆమధ్య చిత్ర నిర్మాతలలో ఒకరు ఈ సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్ కాదని.. పూజా హెగ్డే కు సమానమైన పాత్ర చేస్తుంది అన్నట్లుగా తెలిపారు.. ఆ స్థాయిలో శ్రీ లీల పాత్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమె కెరియర్ పాజిటివ్ టర్న్ తీసుకోవడం ఖాయం అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed