అంజలి కెరీర్ లో హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తోంది గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇది అంజలి నటిస్తున్న 50వ సినిమా. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఈ నెల 11న థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇవాళ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ భయపెట్టేలా ఉంటూనే నవ్వించింది.

ఓ పాడుబడిన బంగ్లాలో షూటింగ్ కోసం అంజలి, శ్రీనివాసరెడ్డి, సునీల్, షకలకశంకర్ తదితరులు వెళ్తారు. అక్కడ ఓ హారర్ రూపొందించాలని ప్లాన్ చేస్తారు. సినిమా కోసం రాసిన సీన్స్ లో దెయ్యాల ప్రవర్తన గురించి చెబుతుంటే అవి నిజంగానే హీరోయిన్ అంజలికి కనిపిస్తుంటాయి. ఆడిషన్ కు వచ్చిన ఆర్టిస్టుల్లా దెయ్యాలు వస్తాయి. ఆ దెయ్యాలు ఎవరు, అవి ఎందుకు ఆ బంగ్లాలో ఉన్నాయి. వాటి ప్లాష్ బ్యాక్ ఏంటనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed