విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమా ఓటీటీ డేట్ ఫిక్సయ్యింది. ఈ సినిమాను జీ 5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి గామి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. గత 8వ తేదీన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. అడ్వెంచర్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ సరసన చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. రెగ్యులర్ ఫార్మేట్ కు భిన్నమైన కథా కథనాలతో దర్శకుడు విద్యాధర్ కాగిత గామి సినిమాను తెరకెక్కించారు.

మనిషి స్పర్శను తట్టుకోలేని ఓ వ్యక్తి ఈ వ్యాధికి విడుగుడు మూలికల కోసం సాగించిన అన్వేషణే ఈ సినిమా. మొత్తం నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ అంథాలజీ ఫార్మేట్ లో గామి సినిమాను రూపొందించారు. హీరోగా విశ్వక్ సేన్ కు, హీరోయిన్ చాందినీకి, దర్శకుడు విద్యాధర్ కు గామితో మంచి పేరొచ్చింది. థియేటర్స్ లో లాభాలు తీసుకొచ్చిన ఈ సినిమా ఓటీటీలోనూ ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడలో గామి అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed