మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ నెల 12వ తేదీ నుంచి మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అనే విషయంపై అనౌన్స్ మెంట్ రాలేదు. అయితే తెలుగులోనూ ఈ నెల 12వ తేదీ నుంచే స్ట్రీమింగ్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

ఆహా ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ కాబోతోందట. ఈ ఏడాది మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన ప్రేమలు సినిమాను రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ అందుకుందీ సినిమా. నస్లెన్ కె గపూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ఓటీటీలో చూసేందుకు చాలా క్రేజ్ ఏర్పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed