మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా యాక్షన్ షెడ్యూల్ బిగిన్ అయ్యింది. హైదరాబాద్ గచ్చిబౌలి అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు. దర్శకుడు వశిష్టతో కలిసి రామ్ లక్ష్మణ్ సెట్ లో ఉన్న ఫొటోను మూవీ టీమ్ రిలీజ్ చేశారు. ఈ షెడ్యూల్ తో విశ్వంభరలో కీలక పార్ట్ కంప్లీట్ కానుంది.
ప్రస్తుత షెడ్యూల్ తర్వాత రెండు వారాల పాటు చిరంజీవి యూరప్ వెకేషన్ వెళ్లనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కూడా వెకేషన్ లో ఉన్నారు. విశ్వంభర యాక్షన్ షెడ్యూల్ పూర్తయితే చిరంజీవికి ఫ్రీ టైమ్ దొరకనుంది. సమ్మర్ కాబట్టి రెండు వారాలు రిలాక్స్ కాబోతున్నారు మెగాస్టార్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ సోషియో ఫాంటసీ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.