ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరోగా తన లక్ష్యమేంటో చెప్పాడు విజయ్ దేవరకొండ. గతంలో ఓ సినిమా విషయంలో 200 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయని చెబితే తనపై విమర్శలు చేశారని, అహంకారం అనుకున్నారని, కానీ తనది ఆత్మవిశ్వాసం మాత్రమేనని విజయ్ అన్నాడు. ఈ కార్యక్రమం దూలపల్లి మైసమ్మగూడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. విజయ్ తో పాటు దర్శకుడు పరశురామ్, హీరోయిన్ మృణాల్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – నేనెప్పుడూ చేసే పని విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంటా. ఆ నమ్మకంతోనే గతంలో 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొడుతున్నాం అని చెప్పాను. ఇది కొందరు అహంకారం అనుకున్నారు. అలా చెప్పకూడదు అని నా మంచి కోరేవాళ్లు నాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు కూడా చెబుతున్నా ఏదో ఒకరోజు 200 కోట్ల రూపాయల వసూళ్లు సినిమా కొడతా. ఇది నాపై నాకున్న నమ్మకం. మీరూ మీరు చేసే పనిలో, మీ డ్రీమ్ పై నమ్మకం ఉంచి పనిచేయడం తప్పకుండా సక్సెస్ అవుతారు. మరో హీరో స్టార్ కాగా లేనిది నేను కాలేనా, మీరు కాలేరా. ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాను మీ ముందుకు తీసుకురావడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed