తమ ఇంట్లో నాన్న ఫ్యామిలీ స్టార్ అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకల్లో అతిథిగా పాల్గొన్నారు చిరంజీవి. ఇదే కార్యక్రమంలో గెస్ట్ గా వచ్చిన హీరో విజయ్ దేవరకొండ చిరంజీవిని కాసేపు ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మీ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరని విజయ్ అడడగా..చిరంజీవి వాళ్ల నాన్న పేరు చెప్పారు. ఎందుకో వివరించారు. నాన్న కానిస్టేబుల్ గా పనిచేసేవారు. ఆయన జీతం చాలా తక్కువ. వచ్చిన ఆ జీతంతోనే మా కుటుంబాన్ని పోషించేవారు. అమ్మకు ఐదుగురు చెల్లెల్లు. మా తాతయ్య చనిపోయాక ఆ ఐదుగురి పెళ్లిల్లు నాన్నే దగ్గరుండి జరిపించారు.

అందుకే ఆయన మా ఫ్యామిలీ స్టార్ అని చిరంజీవి చెప్పారు. అలాగే తనకు ఇప్పటికీ మధ్య తరగతి ఆలోచనా ధోరణే ఉంటుందని చెప్పారు చిరంజీవి. ఇంట్లో అవసరంగా వెలుగుతున్న లైట్స్ ఆఫ్ చేయడం, షాంపూ బాటిల్ లో నీళ్లు పోసి వాడుకోవడం, విరిగిన సబ్బు ముక్కలు అతికించి వాడుకోవడం వంటివి చేస్తుంటానని అన్నారు చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలతోనే స్టార్ గా ఎదగాలనే కసి తనలో పెరిగిందని మెగాస్టార్ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు కార్యక్రమంలో పాల్గొన్న అందరిలో ఆసక్తి కలిగించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed