నితిన్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న తమ్ముడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. దీంతో పాటు టైటిల్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇవాళ నితిన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. తమ్ముడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమ్ముడు సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

బస్సు టాప్ మీద ఈటెను పట్టుకుని ప్రయాణిస్తున్న నితిన్ స్టిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ లో డిజైన్ చేశారు. ఈ బస్సులో లయ కూర్చుని ఉండటం ఉంది. ఆమె సంతోషంగా లేదు. అక్కడ సంతోషంగా లేకపోవడానికి కారణమైన వారిని రిపేర్ చేసేందుకు తమ్ముడు నితిన్ బయలు దేరినట్లు ఈ పోస్టర్ తో తెలుస్తోంది. లయ చాలా కాలం తర్వాత మళ్లీ ఈ సినిమాతో టాలీవుడ్ కు వస్తోంది. ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *