కన్నడ స్టార్ హీరో నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తోంది. ఈ సినిమా ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి..ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తోందన్నది ఈ వార్తల సారాంశం.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ కరీనా కపూర్ తానొక బిగ్ సౌత్ మూవీ చేస్తున్నానంటూ చెప్పింది. దీంతో కరీనా చెప్పిన సౌత్ మూవీ యష్ టాక్సిక్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో యష్ కు సోదరి పాత్రలో కరీనా కపూర్ కనిపించనుందట. గతంలో కేజీఎఫ్ 2లో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కీలక పాత్రలో నటించింది. ఆమె నటించిన పీఎం రమికా సేన్ క్యారెక్టర్ కేజీఎఫ్ 2లో ప్రేక్షకులకు బాగా నచ్చింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కాబట్టి టాక్సిక్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *