మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ సినిమా ఓ బిగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఓ సాంగ్ పిక్చరైజ్ చేశారు. ఇప్పుడీ టీమ్ సమ్మర్ లో కూల్ డెస్టినేషన్ అయిన ఊటీకి చేరుకుంది. సమ్మర్ లో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన ఊటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మెగాస్టార్, త్రిష పాల్గొనే పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి పుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది విశ్వంభర. చిరంజీవి మోకాలు గాయం కోలుకోని టైమ్ లోనూ మిగతా ఆర్టిస్టులతో షూటింగ్ చేశారు. చిరంజీవి సెట్స్ లో అడుగుపెట్టినప్పటి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్టులకు ప్రాధాన్యత ఉండే సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ కేటాయించబోతున్నారు. అందుకే షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ లో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. వచ్చే జనవరి 10న సంక్రాంతి పండుగకు విశ్వంభర రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *