ఈ నెల 29న రిలీజ్ కు రెడీ అవుతోంది సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా. మార్చి సగం నెల కావొస్తున్నా..ఈ సినిమా నుంచి పబ్లిసిటీ సౌండ్ లేదు. దీంతో రిలీజ్ పై డౌట్స్ వస్తున్నాయి. టిల్లు స్క్వేర్ ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. లాస్ట్ ఇయర్ వాయిదాల పర్వం కొనసాగి..ఆఖరికి ఈ నెల 29న ఆగిపోయింది. ఇక్కడైనా ఆగుతుందా లేదా చూడాలి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తర్వాత టిల్లు స్క్వేర్ మీద యూత్ ఆడియెన్స్ లో హైప్ ఏర్పడింది.

అనుపమా హాట్ హాట్ గా కనిపించడం కూడా సినిమా వైపు ఆడియెన్స్ ను ఆకర్షిస్తోంది. ఈ క్రేజ్ ను టిల్లు టీమ్ ఎందుకో నిర్లక్ష్యం చేస్తోంది. అటు సిద్ధుకు, ఇటు అనుపమాకు టిల్లు స్క్వేర్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్ కానుంది. మరోవైపు అనుపమా తన కొత్త సినిమాల మీద దృష్టి పెట్టింది. తమిళంలో ఓ స్పోర్ట్స్ డ్రామా సైన్ చేసింది. తెలుగులో పరదా అనే మరో కొత్త సినిమా షూటింగ్ చేస్తోంది. ఈ సినిమా తన కెరీర్ లో ఇంట్రెస్టింగ్ మూవీ అవుతుందని అనుపమా భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *