ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898ఎడి ట్రైలర్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీమ్. ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. జూన్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే బుజ్జి అనే కారును లాంఛ్ చేసి ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ప్రభాస్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

కల్కి కోసం ప్రభాస్ పార్టిసిపేట్ అయ్యే ఈవెంట్ ఇదొక్కటేనని తెలుస్తోంది. కల్కి ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. మహాభారత కాలం నుంచి భవిష్యత్ దాకా సాగే 6 వేల ఏళ్ల మైథాలజీ సైన్స్ ఫిక్షన్ కథా నేపథ్యంతో కల్కి సినిమాను పొందించారు దర్శకుడు నాగ్ అశ్విన్. సుమారు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *