సినిమాను ఎంత కష్టపడి ఎంత బాగా తెరకెక్కించినా దాన్ని ప్రేక్షకుల దగ్గరకు సరైన విధంగా తీసుకెళ్లకపోతే ఆ సినిమాకు దక్కాల్సిన ఫలితం దక్కదు. అందుకే సినిమా మేకింగ్ అంతా ఒక ఎత్తు డిస్ట్రిబ్యూషన్ మరో ఎత్తు అంటారు. ఈ విషయంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా” సేఫ్ హ్యాండ్స్ లోకి వెళ్లింది. ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోందీ సినిమా.

గం గం గణేశా సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. పలు భారీ, సక్సెస్ ఫుల్ సినిమాలను పంపిణీ చేసిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయంటే కావాల్సినన్ని థియేటర్స్, మంచి లొకేషన్స్ సినిమాకు పడినట్లే. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన “గం..గం..గణేశా” అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ మరో ఐదు రోజుల్లో తెరపైకి వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *