కార్టూన్, యానిమేషన్ సినిమాలకు జపాన్ ప్రసిద్ధి. ప్రపంచంలోని పిల్లలు, పెద్దలంతా చూసే డోరేమాన్, పోకేమాన్, షిన్ షాన్, అకిరా వంటి ఎన్నో ఐకానిక్ కార్టూన్ క్యారెక్టర్స్ క్రియేట్ అయ్యింది జపాన్ లోనే. ఇలాంటి యానిమేషన్ మూవీస్ కు ఇచ్చే అనిమీ అవార్డ్స్ లో మన దేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటిగా నిలిచింది రశ్మిక మందన్న. ఈ అవార్డ్స్ కోసం తన షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని జపాన్ వెళ్లింది. అక్కడ టోక్యో ఎయిర్ పోర్ట్ లో రశ్మికకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు జపాన్ ఫ్యాన్స్.

పలు తెలుగు, హిందీ సూపర్ హిట్ సినిమాలతో రశ్మిక జపాన్ ఫ్యాన్స్ కు ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. టోక్యో ఎయిర్ పోర్ట్ లో రశ్మిక ఫొటోస్ పట్టుకుని ఆమెకు స్వాగతం పలికారు. ఇలాంటి వెల్కమ్ మరో దేశంలో ఊహించని రశ్మిక సర్ ప్రైజ్ అయ్యింది. జపాన్ ఫ్యాన్స్ ప్రేమకు పట్టరాని సంతోషం వ్యక్తం చేసింది రశ్మిక. రేపు టోక్యోలో క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ జరగనున్నాయి. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మనదేశం నుంచి రశ్మిక రిప్రెజెంట్ చేస్తోంది. ప్రస్తుతం రశ్మిక మందన్న పుష్ప 2 సినిమాతో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ మూవీస్ తో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *