మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఇవాళ “ట్రూ లవర్” సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ – “ట్రూ లవర్” ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. వాళ్లకు ఈజీగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. నేను ఈ మధ్య యానిమల్ అనే సినిమాకు తెలుగు డైలాగ్స్ రాశాను. దాని కంటే బాగా ఈ సినిమాకు డైలాగ్స్ రాశాను. ఎందుకంటే మణికందన్ నా ఫ్రెండ్. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ తనే చెప్పుకున్నాడు. ఈ సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కనీసం పది నిమిషాలు ఆలోచిస్తారు. అన్నారు.

ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్, మారుతి గారు ఇప్పటికే బేబి అని బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు. ఇప్పుడు “ట్రూ లవర్” సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా కూడా బేబి మూవీలా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా. మణికందన్ జై భీమ్ లో కీ రోల్ చేశారు. ఆయన పర్ ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – ఇదే మల్టీప్లెక్స్ లో మేము సినిమాలు చూసేవాళ్లం. ఇక్కడే మా “ట్రూ లవర్” సినిమా ట్రైలర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. మా సినిమా తమిళంలో లవర్ గా ఇక్కడ “ట్రూ లవర్” గా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా చేస్తూ చేస్తూ మేమూ మూవీతో ప్రేమలో పడ్డాం. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాను మారుతి, ఎస్ కే ఎన్ గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఫీలవుతున్నాం. థియేటర్స్ లో ఈ నెల 10వ తేదీన “ట్రూ లవర్” చూడండి. అన్నారు

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – మేము నిర్మించిన బేబి సినిమా చూసినప్పుడు ఎలాంటి ఫీల్ కలిగిందో ..ఈ “ట్రూ లవర్” సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అలాంటి ఎగ్జైట్ మెంట్ వచ్చింది. నేను మారుతి ఏదైనా సినిమాను నమ్మితేనే చేస్తాం. ఈ సినిమాను నమ్మాం. రాజా సాబ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తూ డైరెక్టర్ సాబ్ మారుతి బిజీగా ఉన్నా ఈ సినిమా తెలుగు స్క్రిప్ట్ ఎలా వస్తుంది, మిగతా వర్క్స్ ఎలా ఉన్నాయి అని జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళం నుంచి తెలుగులోకి వచ్చి పేరు తెచ్చుకున్న హీరోల్లో ఒకరిగా మణికందన్ గారు ఎదుగుతారు. అలాగే శ్రీ గౌరి ప్రియకు కూడా ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. ఆమె ఇక్కడ రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది. టాలెంటెడ్ యాక్ట్రెస్. రాకేందు మౌళి గారి డైలాగ్స్ చాలా బాగుంటాయి. “ట్రూ లవర్” సినిమా ఫస్ట్ కాపీ చూసి మా ఫ్రెండ్ బన్నీ వాస్ నేను ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పారు. ఆయనకు అంత బాగా నచ్చింది. రెండు రోజుల ముందుగానే ట్రూ లవర్స్ అందరి కోసం ఈ సినిమా ప్రీమియర్ షోస్ వేస్తున్నాం. ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమించాలనుకునేవాళ్లు అందరూ ఈ సినిమాను ఇష్టపడతారు. మంచి సినిమాలు ఏ భాషవైనా ఆదరించడం మన తెలుగు ప్రేక్షకులకు అలవాటు. అలాగే “ట్రూ లవర్” సినిమాను కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. బేబి సినిమాను హిందీ, తమిళంలో రీమేక్ చేస్తున్నాం. ఈ వాలెంటైన్ డేకు బేబి బాలీవుడ్ రీమేక్ అప్డేట్ ఇస్తాం. అన్నారు.

హీరో మణికందన్ మాట్లాడుతూ – కోలీవుడ్ నుంచి సూర్య, కార్తి, విశాల్..ఇలా ఎంతోమంది హీరోలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మంచి సినిమాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని నాకు తెలుసు. నేను చేసిన గుడ్ నైట్, జైభీమ్ సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులు చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ ప్రేమను చూపిస్తూ వస్తున్నారు. నా స్నేహితుడు రాకేందు మౌళికి స్పెషల్ థ్యాంక్స్. తెలుగు నేర్పించి డబ్బింగ్ చెప్పేలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ సినిమాను మేమంతా ఇష్టపడి, కష్టపడి చేశాం. “ట్రూ లవర్” సినిమా యూత్ కు మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా నచ్చేలా ఉంటుంది. ఈ నెల 10వ తేదీన థియేటర్స్ కు వచ్చి మా సినిమా చూడండి. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – “ట్రూ లవర్” సినిమా చూస్తుంటే నేను ఎర్లీ డేస్ లో చేసిన ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమా మూవీస్ గుర్తొచ్చాయి. అప్పటి నుంచి ఇవాళ ప్రభాస్ గారితో రాజా సాబ్ సినిమా చేసేంత వరకు రావడం హ్యాపీగా ఉంది. ప్రేమలో అమ్మాయిలు బాధను ఈజీగా తీసుకుంటారేమో గానీ అబ్బాయిల బాధ వర్ణనానీతం అని చెప్పొచ్చు. తన లవర్ ఎక్కడికి వెళ్తుంది, ఎవర్ని కలుస్తుంది అనేది ఎవరు చూసినా చూడకున్నా..ప్రేమించిన వాడు అబ్జర్వ్ చేస్తుంటాడు. తన ప్రేయసిని మరొకరు ఎవరైనా ట్రాప్ చేస్తారేమో భయపడతాడు. ఈ విషయంలో అమ్మాయిలు తప్పేం లేదు. వాళ్లకు స్నేహాలు ఉండొచ్చు. స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఈ సినిమాలో ఎవరిదో ఒకరిది తప్పని చూపించలేదు. ఒక జంట మధ్య ఏర్పడిన పరిస్థితుల వల్ల ఒక ప్రేమికుడు తన ప్రేమను కాపాడుకునేందుకు ఏం చేశాడు అనేది ఈ సినిమా. ఈ కథను హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు దర్శకుడు ప్రభురామ్ వ్యాస్. ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రాశానని డైరెక్టర్ చెప్పాడు. అతని అనుభవంలో నుంచే ఈ కథ వచ్చిందని అనుకుంటా. లేకుంటే ఇంత పర్పెక్ట్ గా సీన్స్ రావు. “ట్రూ లవర్” సినిమాను తెలుగు ప్రేక్షకులు మిస్ కారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే సినిమా తీయడమే. ఎ ఫిల్మ్ బై అరవింద్ కు కో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నన్ను నిలబెట్టిన సినిమా ప్రేమిస్తే. అప్పటి నుంచి ఏ భాషలో మంచి లవ్ స్టోరీ వచ్చినా ఆడియెన్స్ కు నచ్చుతుందంటే మిస్ కాను. అలాంటి సినిమానే “ట్రూ లవర్”. ఈ సినిమాకు మీ లవర్స్ ను తీసుకెళ్లండి. మీరు మీ బాధ చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రెండు గంటలు చూశాక వాళ్లే అర్థం చేసుకుంటారు. రాజా సాబ్ సినిమా గురించి అప్డేట్ తప్పకుండా ఇస్తాం. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. మీరు ఆశించిన దానికంటే గొప్పగానే రాజా సాబ్ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా. అన్నారు.

నటీనటులు – మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి, శరవణన్, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, పింటు పండు, అరుణాచలేశ్వరన్ తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – రాజ్ కమల్

కాస్ట్యూమ్స్ – నవా రాజ్ కుమార్

ఎడిటింగ్ – భరత్ విక్రమన్

సినిమాటోగ్రఫీ – శ్రేయాస్ కృష్ణ

మ్యూజిక్ – సీన్ రోల్డన్

తెలుగు డైలాగ్స్ – మౌళి

క్రియేటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ ఎంపీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – హరీశ్ దురైరాజ్

ప్రొడక్షన్ కంట్రోలర్ – బాల మురుగన్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – గుడ్ నైట్ ఆర్ నాగరాజన్

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా

బ్యానర్స్ – మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్

ప్రొడ్యూసర్స్ – నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్

తెలుగు రిలీజ్ – మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్

ప్రెజెంటర్స్ – మారుతి, ఎస్ కేెన్

రచన దర్శకత్వం – ప్రభురామ్ వ్యాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *