సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ దీపావళికి నవంబర్ 12న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజైంది. అక్కడ ఎక్స్ పెక్ట్ చేసినంత సక్సెస్ దక్కలేదు. టైగర్ ప్రాంఛైజీ సినిమాల్లోనే నిరాశపర్చిన సినిమాగా టైగర్ 3 మారింది. అయితే సినిమాలోని గ్రాండియర్, సల్మాన్ యాక్షన్ సీక్వెన్సులు సల్మాన్ ఫ్యాన్స్ ను మెప్పించాయి.

టైగర్ 3 సినిమా ఈ నెల 12 నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో రిలీజైన సరిగ్గా నెలకు ఓటీటీలోకి వస్తోందీ మూవీ. టైగర్ 3 సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు మనీశ్ శర్మ రూపొందించారు. కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటించింది. టైగర్ 3కి వచ్చిన రెస్పాన్స్ తో ఇక ఈ సిరీస్ లో కొత్త సినిమా రాకపోవచ్చని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *