ఈ మధ్య తెలుగులో జోరు తగ్గించింది హీరోయిన్ పూజా హెగ్డే. టైర్ 1 హీరోలతో భారీ మూవీస్ చేసిన పూజాకు సరైన హిట్స్ లేక టాలీవుడ్ కు దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఒక్కో సినిమాను ఖాతాలో వేసుకుంటూ తిరిగి ఇండస్ట్రీకి వచ్చేందుకు రెడీ అవుతోంది. నాని హీరోగా నటించనున్న ఓ కొత్త సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఆమెను టీమ్ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.

తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో నాని ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని సమాచారం. గుంటూరు కారం సినిమా నుంచి చివరి నిమిషంలో తప్పుకుంది పూజా హెగ్డే. ఆ తర్వాత ఆమె ప్రాజెక్ట్ ఏదీ తెలుగులో అనౌన్స్ కాలేదు. నాని సినిమా ఓకే అయితే ఈ కన్నడ హీరోయిన్ కు మంచి కమ్ బ్యాక్ కానుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో దేవ అనే సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *